పెళ్లైన నెలకే ప్రియుడితో భార్య జంప్.. రెండో పెళ్లి చేసుకుని భర్తకు షాక్...

Published : Mar 18, 2022, 10:07 AM IST
పెళ్లైన నెలకే ప్రియుడితో భార్య జంప్.. రెండో పెళ్లి చేసుకుని భర్తకు షాక్...

సారాంశం

పెళ్లి అయ్యింది. హాయిగా కాపురానికి వెళ్లింది. కానీ అక్కడ ముభావంగానే ఉంది. అత్తింటివారు కొత్తకదా అనుకున్నారు. కానీ నెల రోజులకు ఆ నవవధువు ఊహించని షాక్ ఇచ్చింది. ఇంట్లోనుంచి వెళ్లిపోయి మరో వ్యక్తితో కలిసి పోలీసుల చెంతకు చేరింది. 

తిరువణ్ణామలై : marriage జరిగిన ఒక నెల రోజుల్లోనే husbandను కాదనుకున్న ఓ యువతి తన ప్రియుడిని Second marriage చేసుకున్న ఘటన సంచలనం రేపింది. Thiruvannamalai జిల్లా వేంగికాల్ గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన బంధువుల యువకుడితో పెద్దలు సంబంధం కుదిర్చి నెల కిందట వివాహం జరిపించారు. అయితే, పెళ్లి అయినప్పటి నుంచి ఆమె మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత మంగళవారం ఉదయం ఇంట్లో ఉన్న యువతి ఉన్న ఫలంగా కనిపించుకుండా మాయమయ్యింది. దీంతో ఆ యువతిని భర్తతో పాటు బంధువులు ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియలేదు. 

ఇదిలా ఉండగా ఇంటినుంచి బయటకు వెళ్లిన ఆ యువతి తన loverని వివాహం చేసుకుని వెళ్లిపోయినట్లు తెలియడంతో భర్తతో పాటు బంధువులు అవాక్కయ్యారు. రెండో వివాహం చేసుకున్న ఆ యువతి ప్రియుడితో కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ తిరువణ్ణామలై తాలూకా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడి పోలీసులు ఈ విషయాన్ని కోర్టులో నిర్ణయించుకోవాలని సలహా ఇచ్చి పంపారు. కాగా, విషయం తెలిసిన బంధువులు, గ్రామస్తులు మాత్రం పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కానీ.. ఇలా పెళ్లైన తరువాత పారిపోవడం ఏమిటని.. అత్తింటి పరువు తీయడం ఏమిటని విసుగు పడుతున్నారు. 

ఇదిలా ఉండగా, నిరుడు నవంబర్ లో ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో జరిగింది. నాలుగైదు గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా కల్యాణ మండపం నుంచి వధువు పరారయ్యింది. మరో వ్యక్తి పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం చోటు చేసుకుంది. 

మదనపల్లెకు చెందిన యువకుడికి, అదే మండలానికి చెందిన యువతికి పెద్దలు నెల క్రితం వివాహం నిశ్చయం చేశారు. శనివారం రాత్రి స్థానిక marriage hallలో విందు ఏర్పాటు చేసి అక్కడే వధూవరులకు నలుగు పెట్టారు. ఆదివారం ఉదయం 5.30 గంటలు పెళ్లి జరగాల్సి ఉంది. కాగా, శనివారం అర్థరాత్రి bride మండపం నుంచి వెళ్లిపోయింది. 

తెల్లవారుజామున గుర్తించిన కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికారు. ఆచూకీ దొరక్కపోవడంతో ఆమె తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు, బంధువులు twotown police station వెళ్లి ఫిర్యాదు చేశారు. వారంతా స్టేషన్ వద్దే ఉన్నారు. ఇంతలో కనిపించకుండా పోయిన ఆ వధువు మరో యువకుడిని పెళ్లి చేసుకుని అక్కడికి వచ్చింది.

తమకు security కల్పించాలని పోలీసులను కోరింది. యువతి మేజర్ కావడతో ఆమె ఇష్టప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు. వధువు మాట్లాడుతూ.. ‘ఇష్టంలేని వివాహం చేస్తున్నారని ఈ నెల 3న డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి నా parentsతో మాట్లాడు. అప్పుడు పెళ్లి చేయమని పోలీసులకు చెప్పారు. ఆ తరువాత నన్ను house arrest చేశారు. అందుకే వివాహ సమయంలో అందరూ పడుకున్నాక వెళ్లాను. నేను ప్రేమించిన వ్యక్తిని పుంగనూరులో పెళ్లి చేసుకున్నా’ అని తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Bhajan Clubbing : మోదీ మెచ్చిన భజన్ క్లబ్బింగ్.. ఇందులో అంత కిక్ ఏముంది? అసలు ఏంటిది?
Attari-Wagah Border Republic Day:భారత్- పాక్ సరిహద్దుల్లో నరాలు తెగిపడే ఉత్కంఠ | Asianet News Telugu