ఒమిక్రాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో 10వ తేదీ వరకు స్కూల్స్ బంద్, స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం

By Siva Kodati  |  First Published Jan 2, 2022, 3:45 PM IST

కరోనాను దృష్టిలో పెట్టుకుని తమిళనాడులోని (tamilnadu) పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇతర తరగతులు, కళాశాల విద్యార్థులకు మార్గదర్శకాలు కూడా సవరించారు. పెరుగుతున్న కరోనా.. ఒమిక్రాన్ కేసుల కారణంగా తమిళనాడులో 1 నుండి 8 తరగతుల పాఠశాలలు జనవరి 10, 2022 వరకు మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.


దక్షిణాఫ్రికాలో పుట్టిన కరోనా (coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron) భారత్‌లోనూ అంతకంతకూ విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక్కొక్క రాష్ట్రం ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో పరిస్ధితులు విషమిస్తున్నాయి. దీంతో అక్కడ కఠిన నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ పట్ల తమిళనాడు ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది.

కరోనాను దృష్టిలో పెట్టుకుని తమిళనాడులోని (tamilnadu) పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇతర తరగతులు, కళాశాల విద్యార్థులకు మార్గదర్శకాలు కూడా సవరించారు. పెరుగుతున్న కరోనా.. ఒమిక్రాన్ కేసుల కారణంగా తమిళనాడులో 1 నుండి 8 తరగతుల పాఠశాలలు జనవరి 10, 2022 వరకు మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అలాగే, 9వ తరగతి నుంచి కళాశాల వరకు విద్యార్థులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు.

Latest Videos

undefined

Also Read:నవోదయ స్కూల్‌లో కరోనా కల్లోలం.. 85 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

జనవరి 10, 2022 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని... కోవిడ్ కేసులు తగ్గకపోతే, మరింత కఠినమైన ఆంక్షలను అమలు చేయడం చేవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం.. తమిళనాడులోని పాఠశాలలు మొదట జనవరి 3, 2022 నుండి తిరిగి తెరవాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నైతోపాటు పొరుగు జిల్లాల్లోని పాఠశాలలు మూతపడ్డాయి.

మరోవైపు.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 27,553 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో వైరస్ తో పోరాడుతూ 284 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు సైతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,22,801 క్రియాశీల కేసులు ఉన్నాయి.  కొత్తగా 9,249 మంది కరోనా వైరస్ నుంచి బటయపడ్డారు. ఒమిక్రన్ కేసులు సైతం పెరిగాయి. ఇప్పటివరకు దేశంలో 1525 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 

click me!