మధ్యప్రదేశ్‌లో నదిలో పడిన బస్సు: ముగ్గురు మృతి, 28 మందికి గాయాలు

Published : Jan 02, 2022, 03:16 PM ISTUpdated : Jan 02, 2022, 03:37 PM IST
మధ్యప్రదేశ్‌లో నదిలో పడిన బస్సు: ముగ్గురు మృతి, 28 మందికి గాయాలు

సారాంశం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్‌పూర్ లో నదిలో బస్సు పడిన  ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 28 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది.

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్‌పూర్ లో నదిలో బస్సు పడిపోవడంతో ముగ్గురు మరణించారు. మరో 28 మంది గాయపడ్డారు.గుజరాత్ రాష్ట్రంలోని చోటా ఉదేపూర్ నుండి Alirajpur కు బస్సు వెళ్తోందని ఎస్పీ Manoj kumar చెప్పారు.

మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉన్నారు. అలీరాజ్‌పూర్ ఆసుపత్రిలో క్షతగాత్రులను తరలించారు.  డ్రైవర్ నిద్ర మత్తులో Bus ను నడపడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందని ఎస్పీ చెప్పారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం Shivraj Singh  విచారం వ్యక్తం చేశారు.

also read:NIRMAL BUS ACCIDENT : నిర్మల్ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

అలీరాజాపూర్ లోని లఖోడా నదిలో 30 ఫీట్ల ఎత్తుపై ఉన్న బ్రిడ్జి నుండి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో జోబాట్ కి చెందిన కైలాష్, అతని భార్య మీరాబాయ్, ఏడాది చిన్నారి సంఘటన స్థలంలోనే మరణించారని పోలీసులు తెలిపారు.సంఘటన స్థలంలో సహాయక బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టుగా సీఎం చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించినట్టుగా సీఎం చెప్పారు. గతంలో కూడా దేశంలోని పలు చోట్ల కూడా నదులు, వాగుల్లో బస్సులు, కార్లు బోల్తా పడిన ఘటనలు చోటు చేసుకొన్నాయి.ఈ ప్రమాదాల్లో పలువురు మరణించిన ఘటనలున్నాయి.ఈ ప్రమాదాల్లో పెద్ద ఎత్తున మరణించిన ఘటనలు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని జల్లేరు వాగులో  బస్సు పడిన ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. ఇరుకైన వంతెన నుండి బస్సు వాగులో పడి పోవడంతో 9 మంది మరణించారు. గత ఏడాది డిసెంబర్ 15న ఈ ఘటన చోటు చేసుకొంది.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం