వివాదాస్పదంగా మారిన ‘అన్నై తమిళ్‌ అర్చనై దిట్టం’.. సుప్రీంలో కెవియట్ పిటిషన్...

By AN TeluguFirst Published Sep 22, 2021, 10:51 AM IST
Highlights

ఆలయాల్లో తమిళంలో అర్చన చేసే వ్యవహారంలో  ప్రభుత్వం తరఫున వివరణ కోరకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని కెవియట్ పిటిషన్లో ప్రభుత్వం కోరింది. 

తమిళనాడు రాష్ట్రంలో హిందూ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయాల్లో తమిళంలో అర్చనలు చేయడానికి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో కెవియట్‌ పిటిషన్ దాఖలు చేసింది. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఇటీవల పరిచయం చేసిన ‘అన్నై తమిళ్‌ అర్చనై దిట్టం’ పథకాన్ని వ్యతిరేకిస్తూ  దాఖలైన పిటిషన్ను మద్రాసు హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో,  రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ఆలయాల్లో తమిళంలో అర్చన చేసే వ్యవహారంలో  ప్రభుత్వం తరఫున వివరణ కోరకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని కెవియట్ పిటిషన్లో ప్రభుత్వం కోరింది.  ముందుగా ఈ పథకానికి వ్యతిరేక తెలుపుతూ తిరుచ్చి జిల్లా  శ్రీరంగంకు చెందిన రంగరాజన్‌ నరసింహన్‌ అనే పూజారి మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజావ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ,  న్యాయమూర్తి ఆదికేశవులతో  కూడిన ప్రథమ ధర్మాసనం నిరాకరించింది. 

అప్పుడు హాజరైన పిటిషనర్ తరఫు న్యాయవాది,  పలు ఆలయాలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్మితమయ్యాయని,  ఆలయాల్లో సంస్కృతం లో మంత్రాలు చదవడం ఈనాటి ఆచారం కాదని,  సంస్కృతంలో  అర్చన చేయకుంటే మంత్రాల విశిష్టతకు భంగం కలుగుతుందని వాదించారు.

కర్ణాటకలో హైటెక్ వ్యభిచారం.. డ్రెస్సింగ్ టేబుల్ కింద రహస్యమార్గం...!

ఇదిలా ఉండగా 2008వ సంవత్సరం  ఆలయాలకు సంబంధించి వెలువరించిన తీర్పులో,  భక్తులు తాము కోరుకున్నట్టు తమిళంలో కానీ, సంస్కృతంలో కానీ అర్చన చేయడం సబబేనా అంటూ న్యాయస్థానం తీర్పు చెప్పినట్లు  న్యాయమూర్తులు గుర్తు చేశారు. గతంలో హైకోర్టు పరిశీలించి ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేమని,  2008లో పరిష్కారమైన ఒక విషయాన్ని మళ్లీ పరిశీలించడం సరికాదని  తేల్చి చెప్పిన న్యాయస్థానం,  ఈ పిటిషన్ను నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

click me!