తాలిబన్ల ప్రాతినిథ్యాన్ని ఒప్పుకోవాలని పట్టుబట్టిన పాక్.. సార్క్ సమావేశం రద్దు... !

By AN TeluguFirst Published Sep 22, 2021, 10:29 AM IST
Highlights

ఈ ప్రతిపాదనపై భారత్‌తో పాటు మరికొంత మంది సభ్యదేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంగీకారం, ఏకాభిప్రాయం లేకపోవడంతో ఈ సమావేశం రద్దు చేయబడింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఏటా జరిగే ఈ సమావేశానికి నేపాల్ ఆతిథ్యమిస్తోంది.

న్యూఢిల్లీ : న్యూయార్క్‌లో శనివారం జరగాల్సిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (SAARC) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం రద్దయ్యింది. సార్క్ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan)కు  తాలిబన్లు (Talibans) ప్రాతినిధ్యం వహించాలని పాకిస్తాన్ (Pakistan) కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ఈ ప్రతిపాదనపై భారత్‌తో పాటు మరికొంత మంది సభ్యదేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంగీకారం, ఏకాభిప్రాయం లేకపోవడంతో ఈ సమావేశం రద్దు చేయబడింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఏటా జరిగే ఈ సమావేశానికి నేపాల్ ఆతిథ్యమిస్తోంది.

ఇప్పటి వరకు భారత్ తాలిబాన్లను గుర్తించలేదు. అంతేకాదు, కాబూల్‌లో కొత్త పాలనను ఇప్పటికీ ప్రపంచం గుర్తించలేదు. అంతేకాదు అగ్రశ్రేణి క్యాబినెట్ మంత్రులను యూఎన్ బ్లాక్‌లిస్ట్ చేసింది.

తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్‌  విదేశీవ్యవహారాల మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖి. అయితే, యూఎన్ బ్లాక్ లిస్ట్ నేపథ్యంలో అతను యూఎన్, దాని అనుబంధ సమావేశాలకు హాజరు అయ్యే అవకాశం లేదు.

వాస్తవానికి, గత వారం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, తాలిబాన్ ఒక సమ్మిళిత ప్రభుత్వం కాదని, ఆఫ్ఘనిస్తాన్ పాలనను అంగీకరించడానికి లేదా గుర్తించడానికి ముందు ప్రపంచం ఆలోచించాలని అన్నారు.

కేరళలో కరోనా కేసుల తగ్గుదల: ఇండియాలో మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరిక

కాబూల్‌లోని ప్రభుత్వంలో మహిళలు, మైనారిటీలకు ప్రాతినిధ్యం లేదని కూడా ఆయన సూచించారు. SAARC అనేది దక్షిణాసియాలోని ఎనిమిది దేశాలైన-బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్,  శ్రీలంకల ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్.

ఆఫ్గనిస్తాన్ కు తాలిబన్ల ప్రాతినిథ్యాన్ని అంగీకరించలేదు.. కానీ ఈ మీట్ లో ఆఫ్ఘనిస్తాన్ పేరిట ఒక ఖాళీ కుర్చీని కేటాయించడానికి సార్క్ లోని మెజారిటీ సభ్యులు అంగీకరించినట్లు తెలిసింది. అయితే, దీనికి పాకిస్తాన్ అంగీకరించలేదు. దీంతో సమావేశం రద్దు చేయబడింది.
 

click me!