కేరళలో కరోనా కేసుల తగ్గుదల: ఇండియాలో మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరిక

By narsimha lodeFirst Published Sep 22, 2021, 10:05 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. నిన్న ఒక్క రోజే 26,964 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇండియాలో ఇప్పటివరకు 3.35 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి.కేరళరాష్ట్రంలో కరోనా 15 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.
 

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో నిన్న ఒక్క రోజు 15,92,395 మందికి పరీక్షలు నిర్వహిస్తే 26,964 మందికి కరోనా సోకిందని ఐసీఎంఆర్ తెలిపింది.గత 24 గంటల్లో 383 మంది కరోనాతో మరణించారు.

ఇండియాలో ఇప్పటివరకు 3.35 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 4.45 లక్షల మంది కరోనాతో మరణించారు.  కేరళరాష్ట్రంలో కరోనా 15 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి తగ్గుతున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.

ఇండియాలో 3,01,989 కరోనా యాక్టివ్ కేసులున్నాయని ఐసీఎంఆర్ ప్రకటించింది. కరోనా యాక్టివ్ కేసుల  రేటు 0.90 శాతానికి తగ్గింది.రికవరీ రేటు 97.77 శాతానికి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.నిన్న ఒక్క రోజే కరోనా నుండి 34 వేల మంది కోలుకొన్నారు. కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 3.27 కోట్లకు చేరుకొంది. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతున్నాయి.ఆ ఐదు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మరో వైపు ఆర్ వాల్యూ తగ్గడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు.


 

click me!