అలా జరిగితే డిక్టేటర్‌ను అవుతానని స్టాలిన్ వార్నింగ్.. ‘కఠిన చర్యలు తీసుకుంటా’

By Mahesh KFirst Published Jul 4, 2022, 3:12 PM IST
Highlights

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో అక్రమాలు, క్రమశిక్షణారాహిత్యం, బాధ్యతారాహిత్యం పెరిగితే తాను డిక్టేటర్‌గా మారి కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
 

చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన దైన రీతిలో పాలనను సాగిస్తున్నారు. తమిళనాడులో ఆయన మార్క్ పాలన కనిపిస్తున్నది. సంక్షేమ పథకాలే కాదు.. మరెన్నో విషయాల్లో ఆయన ఆదర్శంగా ముందుకు వెళ్లుతున్నారు. ప్రజాస్వామిక విలువలు కాపాడుతున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వంతో విబేధాల్లోనూ ఆయన షార్ప్‌గా అటాక్ చేస్తున్నారు. 

సాధారణంగా స్టాలిన్ అంటే రష్యాను ఏలిన జోసెఫ్ స్టాలిన్ ఎక్కువ మందికి గుర్తుకు వస్తారు. ఆయన పాలన ఆదర్శంగా మొదలై చివరకు నియంతృత్వం వైపు మళ్లిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే స్టాలిన్ పేరున్న తమిళనాడు సీఎం డిక్టేటర్‌ను అవుతా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ లోకల్ బాడీ ప్రతినిధులతో నమక్కల్‌లో సమావేశమై మాట్లాడారు. ప్రతినిధులు అందరూ చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని సూచించారు. చట్టానికి అనుగుణంగా నడుచుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అలాగే, మహిళా ప్రతినిధులకు కీలక సూచన చేశారు. వారు తమ బాధ్యతలను భర్తలకు ఇవ్వరాదని తెలిపారు.

అదే సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్రమశిక్షణారాహిత్యం పెరిగితే.. అక్రమాలు పెరిగితే తాను డిక్టేటర్‌ను అవుతానని వార్నింగ్ ఇచ్చారు. 

‘నేను మరీ ప్రజాస్వామికంగా తయారైనట్టు నా సన్నిహిత మిత్రులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎదుటి వారిని వినడం.. వారి అభిప్రాయాలను గౌరవించడం. కానీ, ఎవరికి ఇష్టమైంది వారు చేయడం ప్రజాస్వామ్యం కాదు. ఎవరు ఏమైనా చేయవచ్చని ప్రజాస్వామ్యం చెప్పదు. నేను ఆ దారిలో ఆలోచించలేదు. కానీ, క్రమశిక్షణారాహిత్యం, బాధ్యతారాహిత్యం, అక్రమాలు పెరిగితే మాత్రం నేను నియంతను అవుతాను. కఠిన చర్యలు తీసుకుంటాను. నేను ఈ మాటలు కేవలం స్థానిక సంస్థల ప్రతినిధులకే చెప్పడం లేదు. ప్రతి ఒక్కరికీ చెబుతున్నాను’ అంటూ సవివరంగా విపులీకరించి వార్నింగ్ ఇచ్చారు.

click me!