తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై తన మంచిమనసును చాటుకున్నాడు. ఓ చిన్నారి ఆప్యాయంగా పిలవడంతో పరుగెత్తుకుంటూ వెళ్లి భుజాన ఎత్తుకుని ఆప్యాయంగా పలకరించారు.
చెన్నై : తమిళనాడు ప్రజల మనసులను బిజెపి అధ్యక్షుడు గెలుచుకుంటున్నాడు. కేవలం రాజకీయాలే చేస్తే ఆయన కూడా అందరు రాజకీయ నాయకుల్లా మిగిలిపోయేవాడు. కానీ అన్నామలై అలా కాదు... ఓవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు ప్రజలకు ప్రేమను పంచుతూ దగ్గరవుతున్నాడు. ఈ మాజీ ఐపిఎస్ కమ్ పొలిటీషన్ పై తమిళ ప్రజల ఆదరణ ఎలా వుందో తెలియజేసే వీడియో ఒకటి బయటకు వచ్చింది.
అన్నామలై హడావిడిగా వెళుతుండగా ఓ చిన్నారి ''అన్నామలై మామ... అన్నామలై మామ'' అంటూ పిలిచింది. దీంతో పరుగెత్తుకుంటూ చిన్నారివద్దకు వెళ్లిన అన్నామలై ఆప్యాయంగా పలకరించారు. చిన్నారిని ఎత్తుకుని ముద్దులొలికే మాటలను విన్నాడు. ఇలా తన బిజీ షెడ్యూల్ ను పక్కనబెట్టి చిన్నారికోసం సమయం కేటాయించి తమిళ ప్రజల మనసును మరోసారి దోచుకున్నారు అన్నామలై.
Small girl calling “Annamalai maama…” 🧡
pic.twitter.com/wCpqcziEyg
ఇలా చిన్నారి మామ అన్న పిలుపుకు తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై స్పందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్నామలై చేసినపనికి నెటిజన్ల ఫిదా అవుతున్నారు. ప్రజలను ప్రేమించే అసలైన నాయకుడు అన్నామలై అని అంటున్నారు. ఇక బిజెపి నాయకులు, కార్యకర్తలైతే ఈ వీడియోపై స్పందిస్తూ అన్నామలైని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.