టీటీవీ దినకరన్ కు ఎదురుదెబ్బ: పళని స్వామి ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్

Published : Oct 25, 2018, 10:45 AM ISTUpdated : Oct 25, 2018, 11:07 AM IST
టీటీవీ దినకరన్ కు ఎదురుదెబ్బ: పళని స్వామి ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్

సారాంశం

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. టీటీవీ దినకరన్ కు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటును మద్రాస్ హైకోర్టు సమర్ధించింది. అనర్హత వేటు వేసిన ఎమ్మెల్యేలు అనర్హులేనంటూ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి ఊరట లభించినట్లైంది. 

 

తమిళనాడు: తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. టీటీవీ దినకరన్ కు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటును మద్రాస్ హైకోర్టు సమర్ధించింది. అనర్హత వేటు వేసిన ఎమ్మెల్యేలు అనర్హులేనంటూ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి ఊరట లభించినట్లైంది. 

పళని స్వామి ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు గతంలో టీటీవీ దినకరన్ నేతృత్వంలోని 18 మంది ఎమ్మెల్యేలు గర్వనర్ కు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో 18 మంది ఎమ్మెల్యేలపై స్పకీర్ అనర్హత వేటు వేశారు. దీంతో టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ నేపథ్యంలో కోర్టులో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ఇద్దరు న్యాయమూర్తులు విభిన్న రీతిలో వాదోపవాదనలు చేసిన నేపథ్యంలో విచారణ మూడో న్యామూర్తికి అప్పగించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో జూలై 21 నుంచి కేసు విచారణ జరుతున్న మూడో న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ్ ఆగష్టు 31న తీర్పును వాయిదా వేశారు. 

అయితే తాజాగా గురువారం అక్టోబర్ 25న అనర్హత వేటు పడిన 18మంది ఎమ్మెల్యేలపై కోర్టులో వాదోపవాదనలు వినిపించారు. అయితే స్పీకర్ వేసిన అనర్హత వేటును మూడో న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ్ సమర్థించారు. ఆ 18 మంది ఎమ్మెల్యేలు అనర్హులేనంటూ ప్రకటించింది. దీంతో పళని స్వామి ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ దొరికినట్లైంది. 

మరోవైపు మద్రాస్ హైకోర్టు నిర్ణయంతో షాక్ కు గురైన టీటీవీ దినకరన్ వేటు పడిన ఎమ్మెల్యేలతో చర్చించారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్దామని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వేటుపడిన ఎమ్మెల్యేలతో సమావేశమై సుప్రీం కోర్టును ఎప్పుడు ఆశ్రయించాలన్న అంశంపై ఓ క్లారిటీ తీసుకోనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే