సముద్రంలో బోల్తా: పడవలో మహా సీఎస్ సహ పలువురు అధికారులు

By narsimha lodeFirst Published Oct 24, 2018, 5:51 PM IST
Highlights

మహారాష్ట్ర రాజధాని ముంబై తీరంలోని శివాజీ స్మారక్ వద్ద సముద్రంలో బుధవారం నాడు పడవ మునిగింది


ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై తీరంలోని శివాజీ స్మారక్ వద్ద సముద్రంలో బుధవారం నాడు పడవ మునిగింది.ఈ పడవలో మహరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు అధికారులు ఉన్నారు. అయితే రెస్క్యూ టీమ్ ఇద్దరిని రక్షించింది. గాలింపు చర్యలు చేపట్టారు.

బోటులో శివాజీ  స్మారక విగ్రహం నిర్మించే ప్రాంతం  వద్దకు మహారాష్ట్ర సీఎస్ దినేష్ కుమార్ జైన్ తో పాటు పలువురు సీనియర్ అధికారులు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. సముద్రంలో బోటు మునిగిపోయిన సమయంలో 25 మంది ఉన్నారు.

బోటు బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు చోటు చేసుకొందని అధికారులు ప్రకటించారు. సముద్రంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్స్, మేరైన్ పోలీసులు, ఇతర అధికారులు గాలింపు చర్యల్లో పాల్గొని బాధితులను రక్షించారు.

సముద్రంలో మునిగినవారందరిని సురక్షితంగా రక్షించినట్టు ఇండియన్ కోస్ట్ గార్డ్ పీఆర్ఓ ప్రకటించారు. 

 

All affected people in the capsized boat have been rescued: Indian Coast Guard PRO. https://t.co/WEYoRdFmWW

— ANI (@ANI)

 


: A passenger boat has capsized near Shivaji Smarak ( 2.6 km west of Mumbai's Nariman point). Boat belongs to Maharashtra Government. Rescue operation underway. Most people rescued. pic.twitter.com/rajgTyFEYZ

— ANI (@ANI)
click me!