Tamil Nadu State Anthem: అదే.. మ‌న రాష్ట్ర గీతం.. లేచి నిలబడాల్సిందే’ త‌మిళ ప్ర‌భుత్వం ఆదేశం

Published : Dec 17, 2021, 04:16 PM IST
Tamil Nadu State Anthem: అదే.. మ‌న రాష్ట్ర గీతం.. లేచి నిలబడాల్సిందే’  త‌మిళ ప్ర‌భుత్వం ఆదేశం

సారాంశం

Tamil Nadu State Anthem: తమిళ్ తాయ్ వాళ్‌తు  అనే పాట‌ను రాష్ట్ర గీతంగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అధికారికంగా ప్రకటించింది. అన్ని ప్ర‌భుత్వ‌,  ప్ర‌యివేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహించబడే కార్యక్రమాల ప్రారంభంలో ఈ గీతాన్ని ఆలపించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.   

Tamil Nadu State Anthem: తమిళనాడు రాష్ట్ర ప్ర‌భుత్వం  రాష్ట్ర గీతాన్ని  అధికారికంగా ప్రకటించింది. 'తమిళ తాయ్ వజ్తు  అనే పాటను రాష్ట్ర గీతంగా అధికారిక ప్ర‌క‌టించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో జ‌రిగే.. అన్ని సార్వజనిక కార్యక్రమాల్లోనూ నూ ‘రాష్ట్ర గీతాన్ని’ ఆల‌పించాలని ఆదేశించింది.  ఈ గీతాన్ని ఆల‌పించేప్పుడు.. క‌చ్చితంగా లేచి నిల‌బ‌డాల‌ని సూచించింది. అయితే..  5 సెకన్ల నిడివి గల ఈ పాటను పాడేటప్పుడు వికలాంగులను మినహాయించి అందరూ నిలబడి ఉండాలని ఆదేశిస్తూ ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు.

తమిళ తల్లిని కీర్తిస్తూ రాసిన ‘తమిళ్ తాయ్ వాళ్‌తు’ అనే గీతం.. రాష్ట్ర సౌర‌భాన్ని ప్ర‌తిబింబించే విధంగా.. ఉంటుంద‌ని అన్నారు. రాష్ట్ర గీతం వచ్చేటప్పుడు దివ్యాంగులు తప్ప మిగతా వారంతా లేచి నిలబడాల్సిందేనని ఆదేశాల్లో పేర్కొంది. ఇటీవ‌ల ఐఐటీ–మద్రాస్ లో జ‌రిగిన స్నాతకోత్సవం ఈ పాట‌ను ప్లే చేయలేదు. దీంతో వివాదం అలముకుంది. దీంతో  మద్రాసు హైకోర్టులో ‘తమిళ్ థాయ్ వాళ్తూ’ పాటపై పిటిషన్ దాఖలైంది.  'తమిళ తాయ్ వజ్తు' అనేది ప్రార్థనా గీతం మాత్రమే అని, బహిరంగ కార్యక్రమాలకు హాజరయ్యే వారు పాట సమయంలో నిలబడాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లేదని కోర్టు పేర్కొంది.

Read Also: ఇక పుట్టిన వెంటనే ఆధార్.. హాస్పిటల్ లోనే ఇచ్చేందుకు UIDAI కసరత్తు..

ఈ క్ర‌మంలో మిళనాడు విద్యా శాఖ మంత్రి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం దానిని తాజాగా ‘రాష్ట్ర గీతం’గా ప్రకటించి.. అందరూ లేచి నిలబడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(a) ప్రతి భార‌తీయ పౌరుని విధిగా జాతీయ జెండా మరియు జాతీయ గీతాన్ని గౌరవించాలి.

PREV
click me!

Recommended Stories

100 కాదు 132 శాతం లక్ష్యం... యువతకు ఉపాధిలో ఈ ప్రాంతం రికార్డు
మంచులో దూసుకెళ్లిన వందే భారత్: Tourists Reaction | Katra–Srinagar | Snow Train | Asianet News Telugu