బిర్యానీ పేరుతో ప్రియుడితో రాసలీలలు: భర్తను చంపబోయి ఇలా...

By narsimha lodeFirst Published 3, Sep 2018, 12:30 PM IST
Highlights

ప్రియుడిపై మోజుతో భర్తను హత్య చేయాలనుకొన్నా... అది సాధ్యం కాకపోవడంతో  ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపినట్టు ఓ వివాహిత  పోలీసులకు చెప్పింది.  పిల్లలను చంపి  ప్రియుడితో పారిపోయిన అభిరామిని  పోలీసులు కన్యాకుమారి వద్ద అరెస్ట్ చేశారు.
 


చెన్నై: ప్రియుడిపై మోజుతో భర్తను హత్య చేయాలనుకొన్నా... అది సాధ్యం కాకపోవడంతో  ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపినట్టు ఓ వివాహిత  పోలీసులకు చెప్పింది.  పిల్లలను చంపి  ప్రియుడితో పారిపోయిన అభిరామిని  పోలీసులు కన్యాకుమారి వద్ద అరెస్ట్ చేశారు.

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై కుండ్రత్తూరు  సమీపంలోని మూండ్రాంకట్టలైకు చెందిన విజయ్ భార్య  ప్రియుడిపై మోజుతో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసింది. భర్తను కూడ చంపాలని ప్లాన్ చేసింది.  కానీ, భర్తను చంపే ప్లాన్ సాధ్యం కాకపోవడంతో  ప్రియుడితో కలిసి ఆమె పారిపోయింది.

ఆఫీసులోనే భర్త ఉండడంతో  అతను ప్రాణాలతో బయటపడ్డాడు.  పిల్లలకు విషమిచ్చిన తర్వాత అభిరామి ప్రియుడు సుందరం ఇంటికి వెళ్లింది.  అక్కడ సుందరం ఆమెను కన్యాకుమారికి వెళ్లాలని అక్కడే తాము వచ్చి కలుసుకొంటామని సూచించాడు.

దీంతో అభిరామి కోయంబేడు బస్టాండ్‌ నుంచి బస్సు ఎక్కించిన సుందరం కున్రత్తూరుకు చేరుకున్నాడు. ఇలా ఉండగా పోలీసులు కున్రత్తూరులో తన ఇంట్లో ఉన్న సుందరాన్ని అరెస్టు చేశారు. అతను ఇచ్చిన వివరాల మేరకు ప్రత్యేక పోలీసు బృందం కన్యాకుమారికి చేరికుంది. అక్కడ కన్యాకుమారి బస్టాండ్‌లో అభిరామిని పోలీసులు అరెస్టు చేశారు.

తనపై తన భర్తకు  అనుమానం ఏర్పడిందని బాధితురాలు చెప్పారు. తన భర్త సరిగా ఇంటికి రాడన్నారు.  దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవన్నారు.  బిర్యానీ దుకాణంలో పనిచేసే  సుందరంతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందన్నారు.  తామిద్దరం కూడ పెళ్లి చేసుకోవాలని భావించినట్టు చెప్పారు.

బిర్యానీ ఆర్డర్ పేరుతో సుందరాన్ని తరచూ ఇంటికి  వచ్చేలా చేసినట్టు ఆమె చెప్పారు.  దీంతో తన భర్తకు అనుమానం రావడంతో ఆతడిని హత్య చేయాలని ప్లాన్ చేసినట్టు అభిరామి చెప్పారు.  పాలవలో విషం కలిపి  భర్తను హత్య చేయాలని ప్లాన్ చేస్తే  పిల్లలు తాగి మృతి చెందారని బాధితురాలు చెప్పారు.

ఈ వార్త చదవండి

ప్రియుడిపై మోజు: పిల్లలను చంపేసి ఆ తల్లి ఏం చేసిందంటే..

ఆ అవసరం లేదు: భార్య ఆరోపణలపై టెక్కీ

నపుంసకుడు, నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్: టెక్కీపై భార్య ఆరోపణలు

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

Last Updated 9, Sep 2018, 11:15 AM IST