పన్నీర్ సెల్వం సోదరుడు కన్నుమూత..!

Published : May 15, 2021, 09:47 AM IST
పన్నీర్ సెల్వం సోదరుడు కన్నుమూత..!

సారాంశం

వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాల మురుగన్.. దాదాపు మూడు సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. రెండు, మూడు శస్త్ర చికిత్సలు కూడా చేసుకున్నారు. అయినా.. ఆరోగ్యం కుదుటపడలేదు.

అన్నాడీఎంకే సమన్వయకర్త, తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంట విషాదం చోటుచేసుకుంది. పన్నీర్ సెల్వం సోదరుడు బాలమురుగన్ (55) అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాల మురుగన్.. దాదాపు మూడు సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. రెండు, మూడు శస్త్ర చికిత్సలు కూడా చేసుకున్నారు. అయినా.. ఆరోగ్యం కుదుటపడలేదు.

కొన్నిరోజుల క్రితం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం నుంచి కోలుకుని గురువారం రాత్రి తేని జిల్లా పెరియకుళత్తిలోని ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఏమి జరిగిందో కాని శుక్రవారం తెల్లవారుజాము 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. బాలమురుగన్‌కు భార్య లతా మహేశ్వరి, కుమార్తె ఉన్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఫోన్‌ ద్వారా పన్నీర్‌సెల్వంతో మాట్లాడారు. సంతాపం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !