యువకుడితో అక్రమ సంబంధం: మహిళ దారుణ హత్య

Published : May 15, 2021, 08:37 AM IST
యువకుడితో అక్రమ సంబంధం: మహిళ దారుణ హత్య

సారాంశం

తమిళనాడులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. భర్తను కోల్పోయిన ఆ మహిళకు ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ తగాదాలోనే ఆమె హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు.

చెన్నై: తమిళనాడులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఓ యువకుడితో ఉన్న అక్రమ సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు అనుమానిస్తున్నారు. కల్లకురిచ్చి సమీపంలో శుక్రవారం ఆ మహిళ హత్యకు గురైంది. 

కచ్చిరాయపాళయం అమ్మాపేట గ్రామానికి చెందిన మనోహర్ (45), సంగీత (35) దంపతులకు సురేష్, గోకుల్ అనే కుమారులున్నారు. కొన్నేళ్ల క్రితం మనోహర్ అనారోగ్యంతో మరణించాడు. సంగీత కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. 

శుక్రవారం ఉదయం బలరామ్ పట్ట బస్టాండ్ సమీపంోలని మట్టపారై వెళ్లే రోడ్డులో ఆమె శవమై కనిపించింది. శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న కల్లకురిచ్చి డీఎస్పీ రామనాథన్, కచ్చిరాయపాళయం పోలీసు ఇన్ స్పెక్టర్ రామ్ రాజు అక్కడికి చేరుకుని పరిశీలించారు. సంగీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. 

అత్తియూరుకు చెందిన యువకుడికి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ తగాదాలో ఆమె హత్యకు గురై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu