: తమిళనాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేపీ అంబగజన్ కి కరోనా సోకింది. ఆయన మనపక్కంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
చెన్నై: తమిళనాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేపీ అంబగజన్ కి కరోనా సోకింది. ఆయన మనపక్కంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బుధవారం నాడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంత్రి సీటీ స్కాన్ చేయించుకొన్నాడు. ఈ పరీక్షల్లో కరోనా సోకినట్టుగా అధికారులు ధృవీకరించారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరాడు.చెన్నై నగరంలోని ఉత్తర భాగంలో కరోనా నియంత్రణ చర్యల్లో మంత్రి పనిచేశాడు. బుధవారం నాడు రిప్పన్ భవనంలో జరిగిన కరోనా నియంత్రణ చర్యల సమీక్షను ఆయన నిర్వహించాడు.
also read:24 గంటల్లో ఇండియాలో 13,586 కరోనా కేసులు: కోవిడ్‌తో12,573 మంది మృతి
ఈ పమావేశంలో మంత్రులు ఎస్పీ వేలుమణి, జయకుమార్, కామరాజ్, విజయభాస్కర్ లు కూడ పాల్గొన్నారు.రాష్ట్ర హెల్త్ సెక్రటరీ జే రాధాకృష్ణన్, చెన్నై కార్పోరేషన్ కమిషనర్ ప్రకాష్, సిటీ పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్, ఇతర ఐఎఎస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తమిళనాడు రాష్ట్రంలో 50,193 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 27,624 మంది కరోనా నుండి కోలుకొన్నారు. 576 మంది కరోనా సోకి మరణించారు. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది