చైనాకు తగినబుద్ది చెప్పే రోజులు త్వరలోనే: బీజేపీ ఎంపీ నంగ్యాల్

By narsimha lodeFirst Published Jun 19, 2020, 11:18 AM IST
Highlights

చైనాకు సరిహద్దు ప్రాంతాల్లో చైనా దుశ్చర్యలకు తగినబుద్ది చెప్పే రోజులు త్వరలోనే రానున్నాయని బీజేపీకి చెందిన లడ్డాఖ్ ఎంపీ జమ్యాంగ్ సెరింగ్ నంగ్యాల్ చెప్పారు.


శ్రీనగర్: చైనాకు సరిహద్దు ప్రాంతాల్లో చైనా దుశ్చర్యలకు తగినబుద్ది చెప్పే రోజులు త్వరలోనే రానున్నాయని బీజేపీకి చెందిన లడ్డాఖ్ ఎంపీ జమ్యాంగ్ సెరింగ్ నంగ్యాల్ చెప్పారు.

చైనా ఆక్రమించిన ఆక్జియాచిన్ ప్రాంతం కూడ భారత్ సరిహద్దుకు అతి సమీపంలోనే ఉందన్నారు. ఒక్కప్పుడు అది లడ్డాఖ్ లో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. 
 భారత సైనికులు శాంతిసూత్రాన్ని చైనా ఆర్మీ చేతగానితనంగా భావిస్తోందన్నారు. చైనా ఆకృత్యాలకు కచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

ఈ నెల 15వ తేదీన ఇరు దేశాల సైనికల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు అమరులైన నేపథ్యంలో నంగ్యాల్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. భారత జవాన్ల మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. 

‘1962 నుంచి చైనా అనేకసార్లు భారత్‌పైకి దురాక్రమణకు దిగుతోందన్నారు. ఇప్పటికే మన దేశానికి చెందినే అనేక ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించిందన్నారు.

ప్రస్తుతం చైనా ఆధీనంలోని ఆక్సియాచిన్‌ ముమ్మాటికీ భారత భూభాగమే. దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంతసులువైన అంశం కాదు. అంత కష్టమైన పనికూడా కాదని అనుకుంటున్నానని ఆయన అబిప్రాయపడ్డారు.

1962 నాటి రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం మన దేశంలో లేవు. కేంద్రంలో బలమైన, సమర్థవంతమైన నాయకత్వంతో కూడిన ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇంతకుముందులా చైనా కయ్యానికి కాలుదువ్వడాని ఏమాత్రం అనుకూలంగా లేదని ఆయన స్పష్టం చేశారు.

click me!