పెళ్లిలో డ్యాన్స్ వేసిందని కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు..!

Published : Jan 22, 2022, 03:46 PM IST
పెళ్లిలో డ్యాన్స్ వేసిందని కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు..!

సారాంశం

పెళ్లికి ముందు రోజు సాయంత్రం రెండు కుటుంబాలు కలిసి రిసెప్షన్​ ఏర్పాటు చేశాయి. తరువాత సంగీత్​ కార్యక్రమం నిర్వహించాయి

ఈ మధ్యకాలంలో పెళ్లిలో.. వధూవరులు డ్యాన్స్ లు చేస్తూ సందడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మామూలుగానే పెళ్లిలో సంగీత్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఓ యువతి కూడా తన పెళ్లిలో.. అంతే డ్యాన్స్ వేయాలని అనుకుంది. డీజే పెట్టడంతో.. ఆనందంతో చిందులు వేసింది. అయితే.. ఆమె డ్యాన్స్ చేయడం వరుడికి నచ్చలేదు. అంతే.. చెంప మీద లాగి కొట్టాడు. ఇంకేముంది కోపంతో.. ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు కడలూరులోని పన్రుటిలో వివాహం అర్ధంతరంగా ఆగిపోయింది. తెల్లారితే పెళ్లి అనగా వివాహం ఇష్టం లేదని వధువు ప్రకటించింది. ఆమె మాటను తల్లిదండ్రులు కాదనలేకపోయారు. దీంతో అక్కడకు వచ్చిన బంధువులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు.

ఏం జరిగిందంటే..?జనవరి 20వ తేదీన పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలు నిశ్చయించుకున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నాయి. పెళ్లికి ముందు రోజు సాయంత్రం రెండు కుటుంబాలు కలిసి రిసెప్షన్​ ఏర్పాటు చేశాయి. తరువాత సంగీత్​ కార్యక్రమం నిర్వహించాయి. అందులో డీజే కూడా పెట్టించాయి. ఇందులో వేడుకకు వచ్చిన బంధువులు, స్నేహితులతో వధువు డ్యాన్స్​ చేసింది.

 ఇది అంతా చూస్తున్న వరుడు పెళ్లి కూతురు దగ్గరకు వచ్చి డ్యాన్స్​ ఆపమని అన్నాడు. స్టేజ్​ పైకి పిలిచాడు. రాగానే ఆమెను గట్టిగా లాగి చెంప దెబ్బకొట్టాడు. దీంతో పెళ్లి ఆపేయాలని వధువు అమ్మానాన్నలకు చెప్పింది.కూతురు కోరిన విధంగా తల్లిదండ్రులు పెళ్లి ఆపేసి రాత్రికి రాత్రే మండపం నుంచి ఇంటికి వచ్చారు. వారికి తెలిసిన సమీప బంధువుతో ముందుగా నిశ్చియించిన ముహుర్తానికే  ఆమెకు పెళ్లి చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన వందలాది మృ*తదేహాలు | Asianet News Telugu
భారీ వరదల తర్వాత నేపాల్ లో ప్రస్తుత పరిస్థితి | Drone Visuals | Nepal Flash Floods | From Devi Ghat