తమిళనాడులో విషాదం:కరోనాలో నెగిటివ్, డెంగ్యూతో డాక్టర్ మృతి

By narsimha lode  |  First Published Apr 16, 2020, 1:35 PM IST
కరోనా పరీక్షల్లో డాక్టర్ నెగ్గాడు. కానీ, డెంగ్యూ వ్యాధితో ఆ డాక్టర్ మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. 


చెన్నై:కరోనా పరీక్షల్లో డాక్టర్ నెగ్గాడు. కానీ, డెంగ్యూ వ్యాధితో ఆ డాక్టర్ మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా తాళవాడి సమీపంలోని తెంగుమరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జయమోహన్ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఆయన వయస్సు 29 ఏళ్లు. కొన్ని రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నాడు.  కరోనా వైరస్ వచ్చిందనే నేపథ్యంలో ఆయనను ఆసుపత్రిలో చికిత్స పొందారు. 

ఈ నెల 12వ తేదీన ఆయన ఆసుపత్రిలో డిశ్చార్జ్ అయ్యాడు. కాగా మళ్లీ ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను మెట్టుపాళయంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.

జయమోహన్ కు కరోనా పరీక్షలు నిర్వహిస్తే నెగిటివ్ వచ్చింది. కానీ, డెంగ్యూ పరీక్షలు నిర్వహిస్తే డెంగీ ఉన్నట్టుగా  నిర్ధారణ అయింది. మంగళవారంనాడు డెంగ్యూతో డాక్టర్ మృతి చెందాడు.  ఇదిలా ఉంటే కొడుకు మరణించిన విషయం తెలుసుకొని జయమోహన్ తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గుర్తించి స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.
also read:లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన: ఎద్దు అంత్యక్రియల్లో వందలాది మంది, కేసు

దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి. కరోనాను నివారించేందుకు కేంద్రం ఈ ఏడాది మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను విధించింది. 
click me!