అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. కాగా.. సదరు వివాహిత భర్త రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతని బండారం బట్టబయలైంది.
సోషల్ మీడియాలో అమ్మాయి పేరిట పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయంతో... ఓ వివాహిత ఫోటోలు సేకరించాడు. తర్వాత వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. కాగా.. సదరు వివాహిత భర్త రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతని బండారం బట్టబయలైంది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రామనాథపురం జిల్లా పుదుమఠంకు చెందిన శివకుమార్ (27) బెదిరిం చాడు. దీనిపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం పై విచారణ చేపట్టిన పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో సుకన్య, ప్రియ అనే మహిళల పేరుతో శివకుమార్ ఖాతా ప్రారంభించాడని తెలిసింది.
అందులో అభిప్రాయాలు పంచు కొనే మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి స్ర్కీన్ షాట్ తీసి, వాటిని సంబంధిత మహిళలకు పంపించి, వాటిని సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండాలంటే రూ.50 వేలు ఇవ్వాలని బెదిరించినట్లు విచారణలో తేలడంతో పోలీసులు శివకుమార్‌ను అరెస్ట్ చేశారు. అతను 50 మందికి పైగా మహిళలను మార్ఫింగ్ ఫొటోలతో బెదిరించి డబ్బులు వసూలుచేసినట్లు తెలిసింది.