లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన: ఎద్దు అంత్యక్రియల్లో వందలాది మంది, కేసు

By narsimha lodeFirst Published Apr 16, 2020, 12:31 PM IST
Highlights
తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లా ముదువరపట్టి గ్రామంలో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓ ఎద్దు అంత్యక్రియలను నిర్వహించిన గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
మధురై: తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లా ముదువరపట్టి గ్రామంలో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓ ఎద్దు అంత్యక్రియలను నిర్వహించిన గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ విధించింది కేంద్రం. లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు యధేచ్చగా కొనసాగించారు. ముదువరపట్టి గ్రామంలో ఓ ఎద్దు మృతి చెందింది. ఈ ఎద్దు గ్రామానికి చెందిన ఆలయానికి చెందింది. ఈ ఎద్దు పలు పోటీల్లో పాల్గొన్నట్టుగా గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు.

ఈ ఎద్దు మృతి చెందిన విషయం తెలిసిన పోలీసులు గ్రామానికి వచ్చి వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా కూడ వారు వినలేదు.డ్రోన్ కెమెరా ద్వారా పోలీసులు ఆయా గ్రామాల్లో లాక్ డౌన్ నిబంధనలు ఎలా అమలు అవుతున్నాయనే విషయమై పరిశీలిస్తున్న సమయంలో వందలాది మంది ఒకేచోట గుంపులుగా ఉన్న విషయాన్ని పోలీసులు గమనించారు.

also read:లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: భద్రాచలం ఎమ్మెల్యే సహా 25 మందిపై కేసు

ఈ విషయమై ఆరా తీస్తే జల్లికట్టులో పాల్గొన్న ఎద్దు మృతి చెందడంతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టుగా గ్రామస్తులు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకొని గ్రామస్తులను ఇళ్లకు వెళ్లాలని సూచించారు. 

కానీ, వారు మాత్రం వినలేదు. గ్రామస్తులను కంట్రోల్ చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది.లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.


 
click me!