ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి ఫేక్ బాంబు బెదిరింపు... వికలాంగుడు అరెస్ట్...

Published : Feb 07, 2022, 08:51 AM IST
ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి ఫేక్ బాంబు బెదిరింపు... వికలాంగుడు అరెస్ట్...

సారాంశం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు గంటల పాటు ముఖ్యమంత్రి నివాసంలో క్షుణ్ణంగా తనిఖీలు జరిపిన తరువాత అది ఫేక్ కాల్ అని తేల్చారు. దీనికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

చెన్నై: ముఖ్యమంత్రి M K Stalin నివాసానికి ఫేక్ Bomb threat కాల్ చేసిన ఓ Disabledని పోలీసులు అరెస్ట్ చేశారు. 28 ఏళ్ల ఈ యువకుడిని గ్రేటర్ చెన్నై పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. శనివారం నాడు చెన్నై పోలీస్ కంట్రోల్ రూం కు ఓ కాల్ వచ్చింది. ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టామని.. త్వరలో అది పేలుతుందని సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు Bomb Detection Squadను రంగంలోకి దించారు. 

వెంటనే ముఖ్యమంత్రి నివాసంలో డిటెక్షన్ స్క్వాడ్‌, స్నిఫర్ డాగ్‌లతో క్షుణ్ణంగా Searches నిర్వహించారు. రెండు గంటలపాటు బాంబు కోసం వెతికారు. అయితే ఎలాంటి ఆధారాలు, బాంబు దొరకకపోవడంతో ఆ ఫోన్ Fake Call అని గుర్తించారు. వెంటనే ఈ మేరకు ఓ ప్రకటన కూడా చేశారు. ఆ తరువాత కాల్ మీద ఆరా తీశారు. కంట్రోల్ రూంకు వచ్చిన కాల్ ఆధారంగా పోలీసులు ఆ కాల్ చెంగల్‌పేటనుంచి వచ్చినట్టుగా గుర్తించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు నిందితుడిని తిరుపోరూర్ సమీపంలోని వడపోరుందవాక్కం గ్రామానికి చెందిన అయ్యప్పన్ (28)గా గుర్తించారు.

అయ్యప్పన్ తీవ్ర మనస్తాపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేలింది. రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద ఇస్తామన్న ఇళ్లు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే ఇలా కాల్ చేశానని పోలీసులకు తెలిపాడు. తన ఆర్థిక పరిస్థితిని, తన దుస్థితిని తెలుపుతూ ఇంటి కోసం పలుమార్లు అర్జీలు పెట్టుకున్నానని.. అయినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ విషయమై అధికారులను కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపాడు.

గతంలో కూడా కోయంబేడు బస్‌ టెర్మినస్‌లో బాంబు ఉందని ఫేక్ కాల్ చేసినట్టు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఆ సమయంలో అతని కాల్ తో అప్రమత్తమైన పోలీసులు బస్ టెర్మినల్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఆ సమయంలో కూడా అతడు బూటకపు బాంబు బెదిరింపులకు పాల్పడ్డాడని విచారణలో తేలింది. అతడిపై సీఎంబీటీ పోలీసులు గతేడాది కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి నివాసంలోనే బాంబు ఉందంటూ ఫేక్ కాల్ చేయడంతో..జిల్లాలో అతడిపై మరేదైనా కేసులు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిమీద తదుపరి విచారణ కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 4న తమిళనాడు ముఖ్యమంత్రి Stalin దృష్టిని ఓ Andhra student ఆకర్షించాడు. స్టాలిన్ గురువారం ఉదయం ఇంటి నుంచి సచివాలయానికి కారులో బయలుదేరారు. TTK Roadలో ‘సీఎం సార్ హెల్ప్ మీ’ అనే ప్లకార్డు పట్టుకుని ఉన్న ఓ యువకుడు కనిపించాడు. వెంటనే కారు ఆపమని, యువకుడిని పిలిపించి  స్టాలిన్ మాట్లాడారు. అతను East Godavari Districtకు చెందిన ఎన్.సతీష్ అని తెలిసింది. నీట్ ను వ్యతిరేకిస్తున్న మీకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇలా ప్లకార్డు పట్టుకుని నిలుచున్నానని యువకుడు చెప్పాడు.

ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించినా నీట్ కారణంగా వైద్యవిద్యకు దూరమైనట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. నీట్ రద్దుకు చట్టపరమైన పోరాటాలు జరుగుతున్నాయని ఆ విద్యార్థికి సీఎం వివరించారు. జాతీయ స్థాయిలో గళం వినిపిస్తున్నట్టు కూడా  తెలిపారు. నమ్మకంతో ఊరికి తిరిగి వెళ్లాలి అంటూ ఆ విద్యార్థికి స్టాలిన్ సూచించారు. 

PREV
click me!

Recommended Stories

Bhajan Clubbing : మోదీ మెచ్చిన భజన్ క్లబ్బింగ్.. ఇందులో అంత కిక్ ఏముంది? అసలు ఏంటిది?
Attari-Wagah Border Republic Day:భారత్- పాక్ సరిహద్దుల్లో నరాలు తెగిపడే ఉత్కంఠ | Asianet News Telugu