బహిర్భూమికి వెళ్లిన దళిత బాలిక కిడ్నాప్, హత్యాచారం.. తీవ్రంగా గాయపరిచి.. పంటపొలాల్లో శవాన్ని పడేసి.. దారుణం..

Published : Feb 07, 2022, 06:33 AM IST
బహిర్భూమికి వెళ్లిన దళిత బాలిక కిడ్నాప్, హత్యాచారం.. తీవ్రంగా గాయపరిచి.. పంటపొలాల్లో శవాన్ని పడేసి.. దారుణం..

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. బహిర్భూమికి వెళ్లిన బాలికను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్యాచారం చేశారు. ఈ విషయం బయటికి పొక్కడంతో వారిని పట్టుకోవడానికి వచ్చిన పోలీసులమీదా దాడికి తెగబడ్డారు. 

లక్నో :  Uttar Pradeshలోని గోండా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ Dalit girlపై ఇద్దరు దుండగులు gang rapeకి పాల్పడ్డారు. ఆపై ఆ బాలికను murder చేశారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై firingకు తెగబడ్డారు. ఈ సంఘటనలో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నవాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధి  గ్రామంలోని పంట పొలాల్లో శనివారం ఉదయం ఓ బాలిక dead bodyని స్థానికులు కనుగొన్నారు. శరీరంపై గాట్లు, తీవ్ర గాయాలు గుర్తించారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ మార్కండేయ షాహి, ఎస్పీ సంతోష్ మిశ్రా  పోలీసు బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శుక్రవారం రాత్రి బహిర్భూమి కోసం బాలిక బయటకు రాగానే నిందితులు ఆమెను ఎత్తుకెళ్లి.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు పట్టించిన వారికి రూ.25,000 బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. కాగా ఈ ప్రకటన తర్వాత ఐదు గంటల్లోనే దుండగుల గురించి పోలీసులకు సమాచారం అందింది. 

గ్రామం సమీపంలోని ఓ చెరుకుతోటలో నిందితులు తలదాచుకున్నట్లుగా తెలుసుకుని ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో తప్పించుకునేందుకు నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారు.  పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ఓ దుండగుడి కాలిలోకి తూటాలు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన నిందితుడు మహేష్ యాదవ్ ను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ సంతోష్ మిశ్రా తెలిపారు.  త్వరలోనే అతడిని కూడా అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. 

ఇదిలా ఉండగా,  uttarpradeshలోని బులంద్‌షహర్‌లో మరో హత్రాస్ ఘటన ఈ నెల 2న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ16 యేళ్ల బాలిక దారుణ హత్యాచారానికి గురైంది. అయితే పోలీసులు హడావుడిగా బాలిక cremation చేయించడంతో తల్లిదండ్రులు తమ కూతురి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయేముందు కూతురి మీద gang rape జరిగిందని ఆరోపించారు. ఆమె అంత్యక్రియలకు పూర్తి ఏర్పాట్లు చేయకముందే పోలీసులు మైనర్‌ను దహనం చేయమని బలవంతం చేశారని వాపోయారు.

విషయం వెలుగులోకి రావడంతో గత మంగళవారం ఉత్తరప్రదేశ్ లో భారీ నిరసనలు జరిగాయి. ఈ ఘటన 2020లో జరిగిన దిగ్భ్రాంతికరమైన హత్రాస్ కేసు జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెచ్చేలా చేసింది. మీరట్ లో జరిగిన ఘటనలో "దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఈ సంఘటన జనవరి 21 న జరిగింది. అయితే పోలీసులు బెదిరించడంతో కుటుంబసభ్యులు మౌనంగా ఉన్నారు. మెల్లిగా ఈ విషయం బైటికి పొక్కడం.. రాజకీయ నాయకులు దీనిమీద ట్వీట్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది" అని గ్రామస్థుల్లో ఒకరు చెప్పారు. ఆర్‌ఎల్‌డీ చీఫ్ జయంత్ చౌదరి, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఈ కేసుపై ట్వీట్ చేశారు.

పోలీసులు కొంతమంది "తమ కూతురి మృతదేహాన్నిఅప్పగించి రాత్రిపూట అప్పటికప్పుడు దహనసంస్కారాలు చేయాలని ఆదేశించారని, తాము ఏమీ ఏర్పాట్లు చేసుకోలేదన్నా వినలేదని బలవంతంగా అంత్యక్రియలు చేయించారు’ అని బాలిక తండ్రి చెప్పారు. ఈ ఘటన మీదఐపీసీ, పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నలుగురు నిందితుల్లో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?