
శివమొగ్గ : Karnataka లోని శివమొగ్గలో దారుణ ఘటన జరిగింది.
Minor అయిన భార్య చెల్లెలిని మాయమాటలతో లోబరుచుకుని ఆమెను గర్భవతిని చేశాడో కీచక బావ. సదరు బావ మీద జిల్లాలోని కుంసి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అక్క-బావ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న బాలికను తోబుట్టువుల చూసుకోవాల్సిన brother-in-law ఆమె మీద కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకుని sexual desires తీర్చుకుంటున్నాడు.
ఇటీవల బాలికకు అనారోగ్యంగా ఉండటంతో అక్క చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ బాలిక ఏడు నెలల pregnant అని వైద్యులు తెలిపారు. దీంతో అక్క షాక్ కు గురైంది. తరువాత బాలిక ద్వారా జరిగిన విషయం తెలుసుకుంది. బయటికి పొక్కితే సంసారం ఇబ్బందుల్లో పడుతుందనుకుందో ఏమో.. బాలికకు 18 ఏళ్లు నిండాయని చెప్పి.. గొడవలు లేకుండా ఇంటికి తీసుకువచ్చారు.
అనంతరం బాలికకు నొప్పులు రాగా మెగ్లాన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఏడు నెలలకే ప్రసవం కాగా బిడ్డ మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సదరు కీచక బావను కటకటాల్లో కి తరలించారు.
తీర్థ హళ్లిలో మరో కేసు
తీర్థ హళ్లి పట్టణంలో మరో పోక్సో కేసు నమోదైంది.తాపీ పని చేయడానికి వచ్చిన యువకుడు స్థానిక బాలికతో పరిచయం పెంచుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా, Uttar Pradeshలోని గోండా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ Dalit girlపై ఇద్దరు దుండగులు gang rapeకి పాల్పడ్డారు. ఆపై ఆ బాలికను murder చేశారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై firingకు తెగబడ్డారు. ఈ సంఘటనలో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నవాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధి గ్రామంలోని పంట పొలాల్లో శనివారం ఉదయం ఓ బాలిక dead bodyని స్థానికులు కనుగొన్నారు. శరీరంపై గాట్లు, తీవ్ర గాయాలు గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ మార్కండేయ షాహి, ఎస్పీ సంతోష్ మిశ్రా పోలీసు బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శుక్రవారం రాత్రి బహిర్భూమి కోసం బాలిక బయటకు రాగానే నిందితులు ఆమెను ఎత్తుకెళ్లి.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు పట్టించిన వారికి రూ.25,000 బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. కాగా ఈ ప్రకటన తర్వాత ఐదు గంటల్లోనే దుండగుల గురించి పోలీసులకు సమాచారం అందింది.
గ్రామం సమీపంలోని ఓ చెరుకుతోటలో నిందితులు తలదాచుకున్నట్లుగా తెలుసుకుని ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో తప్పించుకునేందుకు నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ఓ దుండగుడి కాలిలోకి తూటాలు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన నిందితుడు మహేష్ యాదవ్ ను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ సంతోష్ మిశ్రా తెలిపారు. త్వరలోనే అతడిని కూడా అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.