చత్తీస్ఘడ్ హైకోర్టు తీర్పు : ‘ఇదొక్కటే మిగిలింది..’ అసహనం వ్యక్తం చేసిన తాప్సీ పన్ను..

By AN TeluguFirst Published Aug 27, 2021, 5:11 PM IST
Highlights

తాప్సీ ఈ పోస్టులో చత్తీస్ఘడ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పేర్కొంటూ.. ‘అంతే... ఇప్పుడు మనం వినాల్సిన వాటిలో ఇది ఒకటి మాత్రమే మిగిలింది’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను షూటింగ్తో ఎంత బిజీగా ఉన్నా సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు.  ముఖ్యంగా మహిళలపై జరిగే దాడులు, వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తారు.  తాజాగా అలాంటి ఘటనపై తాప్సీ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారం కేసులో చత్తీస్ఘడ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ తాప్సీ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.  

తాప్సీ ఈ పోస్టులో చత్తీస్ఘడ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పేర్కొంటూ.. ‘అంతే... ఇప్పుడు మనం వినాల్సిన వాటిలో ఇది ఒకటి మాత్రమే మిగిలింది’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

కాగా, భార్యపై భర్త అత్యాచారానికి పాల్పడిన కేసులో ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెలువరించింది. వివాహం చేసుకున్నభార్య ఇష్టానికి విరుద్ధంగా, బలవంతంగా శృంగారం చేస్తే చట్ట ప్రకారం నేరం కాదని, అది అత్యాచారం కిందికి రాదంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే భార్య వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అంతేకాక ఈ కేసులో భర్తను నిర్దోషిగా విడుదల చేస్తూ.. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తి ఎన్ కే చంద్రవంశీ తీర్పు వెలువరించారు. 

దీంతో చత్తీస్గడ్ ఇచ్చిన ఈ తీర్పు పై తాప్సీ తో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  గాయనీ సోనా మొహపాత్ర కూడా ట్వీట్ చేస్తూ హైకోర్టు తీర్పును వ్యతిరేకించారు. 
 

click me!