
రోడ్డుపై నిలిపి ఉన్న ట్రక్కును ఓ ఎస్ యూవీ ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై-పూణె ఎక్స్ ప్రెస్ వేపై చోటు చేసుకుంది. అయితే వాహనం అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
అయోధ్య రామమందిరం అంశాన్ని కోర్టులో కాంగ్రెస్ పొడిగిస్తూ వచ్చింది.. అప్పుడే మోడీ వచ్చారు.. - అమిత్ షా
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకు చెందిన పలువురు వ్యక్తులు తమ ఎస్ యూవీ వాహనంలో పూణె గురువారం వెళ్తున్నారు. వీరి వాహనం ముంబై-పుణె ఎక్స్ ప్రెస్ వేపై ప్రయాణిస్తోంది. అయితే ఉర్సే టోల్ ప్లాజా సమీపంలోకి చేరుకునే సరికి ఎస్ యూవీ వేగంగా ఓ డివైడర్ ను ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కనే ఆగి ఉన్న ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు.
తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి ప్రమాదకరం - ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
‘‘కారు అతివేగంగా వెళ్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. తొలుత డివైడర్ ను ఢీకొట్టిన ఈ కారు ఆ తర్వాత రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. కారులో ఉన్న నలుగురు మరణించారు’’ అని షిర్గావ్-పరంద్వాడి పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ వనితా ధుమాల్ తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
ఇదే హైవేపై గతేడాది నవంబర్ 17వ తేదీన కూడా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. 17వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో మారుతీ సుజుకీ కారు పూణె నుంచి ముంబైకి వెళ్తోంది. ఆ సమయంలో కారులో 9 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఖోపోలి సమీపంలోకి చేరుకోగానే ఆ కారు ట్రక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఖోపోలి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలోనే నలుగురు చనిపోయారు. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్ తరలించారు.
ప్రధానిని పొగడాలని నాకెవరూ చెప్పలేదు.. నా మనసులో ఉన్నది మాట్లాడాను - పద్మ అవార్డు గ్రహీత క్వాద్రీ
అయితే ఈ క్రమంలో ఒకరి పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే మరణించారు. కాగా ఈ ఘటనలో చనిపోయిన వారంతా పురుషులే, గాయపడిన నలుగురిలో ఒకరు మహిళ ఉన్నారు. డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.