మదర్సా హాస్టల్ లో బాలిక అనుమానాస్పద మృతి.. టీచర్ వేధింపులంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ

Published : May 16, 2023, 03:10 PM IST
మదర్సా హాస్టల్ లో బాలిక అనుమానాస్పద మృతి.. టీచర్ వేధింపులంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ

సారాంశం

Balarampuram: మదర్సా హాస్టల్ లో బాలిక అనుమానాస్పద స్థితిలో మ‌ర‌ణించింది. అయితే, దీనికి కార‌ణం టీచర్ వేధింపులంటూ కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. ఈ షాకింగ్ ఘ‌ట‌న కేరళలో చోటుచేసుకుంది. మృతురాలిని తిరువనంతపురంలోని బీమపల్లికి చెందిన అస్మియా మోల్‌గా గుర్తించారు.  

Kerala girl found dead at madrasa hostel: కేరళలోని తిరువనంతపురంలోని బలరాంపురం సమీపంలోని మదర్సాలో చదువుతున్న 17 ఏళ్ల బాలిక తన హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మత అధ్యయన కేంద్రంలో కొత్త ఉపాధ్యాయుడు మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తూ, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. బలరాంపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి తిరువ‌నంత‌పురంలోని బీమపల్లికి చెందిన అస్మియా మోలేగా గుర్తించారు. ఆమెను ఇన్‌స్టిట్యూట్ నుంచి తీసుకువెళ్లాల‌ని శనివారం వారి కుటుంబ స‌భ్యుల‌కు తెలిపిన‌ట్టు స‌మాచారం. 

మదర్సాలో టీచర్ బాలికను మానసికంగా హింసించాడని మృతురాలి తల్లి బలరాంపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.మృతుడు బలరాంపురం సమీపంలోని ఓ మత అధ్యయన కేంద్రంలో హాస్టల్ లో ఉంటున్నాడు. బలరాంపురం పోలీసుల కథనం ప్రకారం.. అస్మియా మోలే శనివారం మధ్యాహ్నం తన తల్లికి ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. ఆమె తల్లి సాయంత్రం 4.30 గంటలకు మదర్సాకు చేరుకుంది. ఇంటికి తీసుకెళ్ల‌డానికి అనుమతి తీసుకోవాలని కోరారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో బాలిక లైబ్రరీలో ఉరివేసుకుని ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఆమె తల్లి నెయ్యట్టింకరలోని ఓ  ప్ర‌యివేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. రాత్రి 7 గంటలకు వచ్చేసరికి ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

రంజాన్ సందర్భంగా ఇంటికి వచ్చిన బాలిక మదర్సాలోని కొత్త ఉపాధ్యాయుడు తనను మానసికంగా వేధిస్తున్నాడని తల్లికి చెప్పినట్లు బాలిక మేనమామ తాజుద్దీన్ తెలిపారు. మే 2న మదర్సాకు తిరిగి వచ్చిన ఆమె టీచర్ గురించి మరోసారి తల్లికి ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై సరైన విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ 135 మంది విద్యార్థులు చదువుతున్నట్లు మీడియా ద్వారా తెలిసింది. అయితే, 'ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలేమిటో తెలియాల్సి ఉంది. అక్కడ ఆమెకు ఎదురైన సమస్యలేంటి? ఆమె మరణం వెనుక ఎవరున్నారో మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాం' అని మృతురాలి మేనమామ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu