అంకిత్ శర్మ హత్య కేసులో నిందితుడు: పరారీలో తాహిర్ హుస్సేన్

By telugu teamFirst Published Feb 29, 2020, 11:50 AM IST
Highlights

ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో నిఘా విభాగం అధికారి అంకిత్ శర్మ హత్య జరిగింది. ఈ కేసులో నిందితుడు తాహిర్ హుస్సేన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తాహిర్ హుస్నేన్ ఆప్ నుంచి సస్పెండైన విషయం తెలిసిందే.

న్యూడిల్లీ: అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో మెల్లగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సిఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ప్రారంభమైన ఘర్షణ ఈశాన్య ఢిల్లీలో తీవ్రమైన హింసకు దారి తీసింది. దాదాపు 42 మంది ఈ అల్లర్లలో చనిపోగా, 200 మంది దాకా గాయపడ్డారు. 

నిఘా విభాగం ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో నిందితుడైన తాహిర్ హుస్సేన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంకిత్ శర్మ హత్యలో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడంతో తాహిర్ హుస్సేన్ ను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి సస్పెండ్ చేశారు. అతనిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. 

Also Read: తాహిర్ హుస్సేన్ మెడకు బిగుస్తున్న ఉచ్చు: ఆప్ నుంచి సస్పెన్షన్

అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు తిరిగి పర్యటిస్తున్నారు. అల్లర్లకు సంబంధించి పోలీసులు 148 కేసులు నమోదు చేశారు. వీటిలో 25 కేసులు ఆయుధాల చట్టం కింద నమోదయ్యాయి. అల్లర్లకు సంబంధించి తమకు అందిన అన్ని ఫిర్యాదులను ప్రభుత్వం పరిశీలించి, న్యాయమైనవాటిని పోలీసులకు పంపిస్తుందని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

వాట్సాప్ ల్లో చాలా సమాచారం వెళ్తోందని, ప్రమాదకరమైన సందేశాలు వస్తే వాటిని తమకు ఫిర్యాదు చేయాలని, ఆ విధమైన సందేశాలను తాము పోలీసులకు పంపిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: అంకిత్ శర్మ హత్యలో ఆప్ నేత పాత్ర: కేజ్రీవాల్ స్పందన ఇదీ

click me!