BSF Firing On Drone: పాక్ సరిహద్దుల్లో మ‌రోసారి డ్రోన్ కలకలం..

Published : Jun 09, 2022, 11:56 AM IST
BSF Firing On Drone: పాక్ సరిహద్దుల్లో మ‌రోసారి డ్రోన్ కలకలం..

సారాంశం

BSF Firing On Drone:  కాశ్మీర్ లోని భార‌త్- పాక్ స‌రిహ‌ద్దుల్లో డ్రోన్ క‌లక‌లం సృష్టించింది. గురువారం జమ్మూలోని అర్నియా ప్రాంతంలో 300 మీటర్ల ఎత్తులో డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించారు భ‌ద్ర‌తబ‌లాగాలు.   

BSF Firing On Drone: జమ్మూలోని పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్  (Drone)  కలకలం సృష్టించింది. గురువారం ఉదయం భార‌త్- పాక్  సరిహద్దుల్లో  పాక్ డ్రోన్ ప్రవేశించేందుకు ప్రయత్నించింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. దీంతో డ్రోన్ తిరిగి పాక్ సరిహద్దుల్లోకి వెళ్లిపోయినట్టు అధికారులు తెలిపారు.

అధికారుల స‌మాచారం మేర‌కు.. అర్నియా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ప్రకాశవంతమైన కాంతిని BSF అధికారులు గ‌మ‌నించారు. తర్వాత అది డ్రోన్  (Drone) అని తేలింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన BSF అధికారులు కాల్పులు జరిపాయి. స‌రిహ‌ద్దులో ఆ డ్రోన్ 300 మీటర్ల ఎత్తులో ఎగిన‌ట్టు గుర్తించారు. గ‌త‌ రెండు రోజుల క్రితం.. కూడా ఇలాంటి ఘ‌ట‌న‌నే జ‌రిగింది. జమ్మూలోని అఖ్నూర్ ప్రాంతంలో..800 మీటర్ల ఎత్తులో డ్రోన్ ఎగురుతున్నట్లు  BSF గుర్తించబడింది, ఆ తర్వాత కాల్పులు జరప‌డంతో ఆ డ్రోన్ వెనక్కి వెళ్ళింది.

ఈ ఘ‌ట‌న‌పై బీఎస్ఎఫ్ ప్రతినిధి స్పందించారు. ‘ఈరోజు ఉదయం 4:15 ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అర్నియా ప్రాంతంలో ప్రకాశవంతమైన కాంతిని గమనించాం. దీంతో అప్ర‌మ‌త్త‌మైన మా సిబ్బంది కాల్పులు జరిపారు. ఆ డ్రోన్ పాక్ లోకి తిరిగి వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం సరిహద్దు వెంట గాలింపు చేప‌డుతున్నాం’అని తెలిపారు. ఎక్కడైనా సరిహద్దు వెంట బాంబులు, ఆయుధాలను జారవిడిచిందా ? అనే కోణంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు సరిహద్దుల వెంట సెర్చ్ ఆపరేషన్ ను భద్రతా దళాలు ప్రారంభించాయి. నిఘాను మరింత పటిష్టం చేసినట్టు అధికారులు వివరించారు. 

ఇంతకు ముందు.. కతువా, సాంబా సెక్టార్లలో అనేక డ్రోన్‌లను BSF కాల్చివేసింది. ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలతో పాటు పేలోడ్‌లను స్వాధీనం చేసుకున్నాయి. సోమవారం కూడా డ్రోన్ ద్వారా జారవిడిచిన మూడు మాగ్నెటిక్ ఐఇడిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

డ్రోన్ల ద్వారా ఐఈడీలు రవాణా
 
డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ని పంపుతున్నారు.  దీని ఉద్దేశ్యం ఏమిటంటే.. ఉగ్రవాదుల కోసం పనిచేసే సహాయకులకు IED సులభంగా చేరవేయ‌వ‌చ్చు.  గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలను జారవిడుస్తున్న‌ఉదంతాలు అనేకంగా ఉన్నాయి. మంగళవారం కనచక్ ప్రాంతంలో ఓ IED ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గుర్తించాయి. కొన్ని రోజుల క్రితం.. కతువాలోని రాజ్‌బాగ్‌లో పేలోడ్‌తో కూడిన డ్రోన్ కాల్చివేసిన‌ట్టు అధికారులు తెలిపారు. 
 
ఐఈడీలను సేకరించేందుకు వచ్చిన సహాయకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సరిహద్దు ఆవల నుంచి హైవేపై ఐఈడీలను పడేస్తారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఎక్కడైనా ఇరుక్కుపోయే పరిస్థితి ఉంటే తప్పించుకోవడం తేలిక. హైవేపై వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ గుర్తించడం కష్టం అవుతుంది. సమాచారం ప్రకారం.. గత ఏడాది కాలంలో.. కథువా, అఖ్నూర్, అర్నియా, సాంబాలో డ్రోన్ల ద్వారా సరిహద్దు దాటి ఐఇడిలు, ఆయుధాలను రవాణా చేసిన‌  7 కేసులు నమోదయ్యాయని  అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ