ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీష్ సిసోడియాకు ఈ నెల 17 వరకు జ్యుడిషీయల్ కస్టడీ పొడిగింపు

Published : Apr 03, 2023, 02:50 PM ISTUpdated : Apr 03, 2023, 03:06 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీష్ సిసోడియాకు  ఈ నెల  17 వరకు  జ్యుడిషీయల్ కస్టడీ  పొడిగింపు

సారాంశం

 ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు  జ్యుడిషీయల్  కస్టడీని  పొడిగిస్తూ  సీబీఐ ప్రత్యేక కోర్టు  సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ: డిల్లీ  మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు  జ్యుడీషీయల్  కస్టడీని  ఈ నెల  17వ తేదీ వరకు  ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు  పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  మనీష్ సిసోడియాను   సీబీఐ అధికారులు  అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే.  ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు కీలక దశలో ఉందని  సీబీఐ తరపు న్యాయవాది   కోర్టుకు తెలిపారు.  మనీష్ సిసోడియాకు  జ్యుడిషీయల్ కస్టడీని పొడిగించాలని  కోరారు. దీంతో  మనీష్ సిసోడియాకు  జ్యుడిసీయల్ కస్టడీని కోర్టు పొడిగిస్తూ  ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. మనీష్ సిసోడియా గత వారం  బెయిల్ పిటిషన్ ను దాఖలు చేసుకున్నారు. కానీ  మనీష్ సిసోడియాకు  కోర్టు  బెయిల్ మంజూరు చేయలేదు.  గత నెల  31న  మనీష్ సిసోడియా  దాఖలు  చేసిన బెయిల్ ను  కోర్టు తిరస్కరించింది .

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  పలుమార్లు  విచారించిన తర్వాత   మనీష్ సిసోడియాను   సీబీఐ అధికారులు  ఈ ఏడాది మార్చి  26న అరెస్ట్ చేశారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  రెండో చార్జీషీట్ లో   ఢిల్లీ  మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  పేర్లను  చేర్చారు దర్యాప్తు  అధికారులు.

రెండో చార్జీషీట్ దాఖలు  చేసిన   కొద్ది రోజులకే  మనీష్ సిసోడియాను  సీబీఐ అధికారులు  విచారించారు. అనంతరం   ఆయన ను అరెస్ట్  చేశారు.  ఆ తర్వాత  హైద్రాబాద్ కు  చెందిన అరుణ్ రామచంద్రపిళ్లైను  ఈడీ అధికారులు  అరెస్ట్  చేశారు.  అరుణ్ రామచంద్రపిళ్లై  స్టేట్ మెంట్  ఆధారంగా  బీఆర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను  ఈడీ అధికారులు విచారించారు. 

also read@ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియాకు చుక్కెదురు, బెయిల్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశంలో  ప్రకంపనలు రేపుతుంది.   డిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు  సంస్థలు అనుమానాలు వ్యక్తం  చేస్తున్నాయి. ఈ దిశగానే  దర్యాప్తు  సంస్థలు  విచారణ చేస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో  దర్యాప్తు సంస్థలు  విచారణ నిర్వహించాయి.  రెండు తెలుగు రాష్ట్రాలకు  చెందిన  పలువురిని దర్యాప్తు  సంస్థలు  ఈ కేసులో  అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్