మమతకు సుప్రీం వార్నింగ్

Siva Kodati |  
Published : May 15, 2019, 01:46 PM IST
మమతకు సుప్రీం వార్నింగ్

సారాంశం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బీజేవైఎం కార్యకర్త ప్రియాంక శర్మను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బీజేవైఎం కార్యకర్త ప్రియాంక శర్మను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీం హెచ్చరించింది.

మార్ఫింగ్ చేసిన మమత బెనర్జీ ఫోటోను ప్రియాంక శర్మ అరెస్ట్ ఏకపక్షమని సుప్రీం అభిప్రాయపడింది. ఆమెను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని లేకుంటే తదుపరి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించింది.

ప్రియాంక శర్మను విడుదల చేయాల్సిందిగా మంగళవారం అత్యున్నత ధర్మాసనం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ మమత సర్కార్ ఈ ఆదేశాలను పట్టించుకోలేదు.

దీంతో ప్రియాంక బంధువులు బుధవారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం పై విధంగా తీర్పును వెలువరించింది. కాగా, మమతపై అభ్యంతరకర పోస్ట్‌ను ఫార్వర్డ్ చేసినందుకు గాను ప్రియాంక క్షమాపణలు చెప్పిన తర్వాతే ఆమెను విడుదల చేస్తామని బెంగాల్ అధికారులు ప్రకటించారు.

అయితే ఆమెను బుధవారం ఉదయం 9.40 గంటలకు విడుదల చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే మంగళవారం ఆమెను ఎందుకు విడుదల చేయలేదని న్యాయస్ధానం ప్రశ్నించింది. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Ajit Pawar: అధికార లాంఛనాలతో ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు | Asianet News Telugu
Deputy CM Ajit Pawar | Amit Shah | అజిత్ పవార్ కు కన్నీటి వీడ్కోలు పలికిన అమిత్ షా | Asianet Telugu