రేపే అయోధ్య తీర్పు: ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ...దేశవ్యాప్తంగా హైఅలర్ట్

Published : Nov 08, 2019, 09:45 PM ISTUpdated : Nov 09, 2019, 08:16 AM IST
రేపే అయోధ్య తీర్పు:  ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ...దేశవ్యాప్తంగా హైఅలర్ట్

సారాంశం

వివాదాస్పద అయోధ్య కేసులో శనివారం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. రేపు ఉదయం 10.30 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. 

వివాదాస్పద అయోధ్య కేసులో శనివారం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. రేపు ఉదయం 10.30 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.

ఈ నేపధ్యంలో కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. అలాగే అన్ని రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

అయోధ్య తీర్పు నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలీస్ ఉన్నతాధికారులు, డివిజనల్ కమీషనర్లు, జిల్లా మెజిస్ట్రేట్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ ఏర్పాటు చేసి.. పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Also Read:అయోధ్య కేసు: వాదనల చివరి రోజున సుప్రీంలో హైడ్రామా

ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అటు యూపీ పోలీస్ శాఖ సైతం భద్రతా చర్యల కోసం రెండు హెలికాఫ్టర్లు, 20 తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసింది. ఇంటెలిజెన్స్ సూచనలకు అనుగుణంగా వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో పాటు అన్ని సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచారు.

మరోవైపు రేపటి తీర్పు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎస్ సెక్రటరీ, డీజీపీలతో చీఫ్ జస్టిస్ రంజాన్ గొగొయ్ సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్ధితి, తీర్పు తదనంతర పరిణామాలు, శాంతి భద్రతలపై ఆయన ఆరా తీశారు. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం అయోధ్యకు సుమారు 4 వేల మంది పారా మిలటరీ సిబ్బందిని తరలించింది. 

అయోధ్యకేసుపై సుప్రీంకోర్టుధర్మాసనం 40  రోజుల పాటు అన్నివర్గాల వాదనలను వింది. చివరిరోజున సుప్రీంకోర్టులో  నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి.హిందూ మహాసభకు చెందిన న్యాయవాది కోర్టులో ఓ బుక్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సమయంలో వేరే పక్షానికి చెందిన న్యాయవాదులు ఈ పుస్తకాన్ని చించేశారు. ఈ పరిణామంపై సుప్రీంకోర్టు చీప్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పుడే  కోర్టు నుండి వాకౌట్ చేస్తానని హెచ్చరించారు

విచారణను పూర్తి చేస్తామని కూడ ఆయన తేల్చి చెప్పారు. ఈ పరిణామంతో  షాక్ కు గురైన న్యాయవాదులు తమ వాదనలను విన్పించారు.ఇంకా  ఈ కేసు విషయమై ఏమైనా చెప్పాలనుకొంటే మరో మూడు రోజుల వరకు రాతపూర్వకంగా కోర్టుకు చెప్పాలని  ధర్మాసనం ఆదేశించింది.

Also Read:నేను శ్రీరాముని వంశస్థురాలిని, అయోధ్యపై హక్కు వద్దు: బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు

ఈ కేసుపై నవంబర్ 17వ తేదీ లోపుగా తుది తీర్పును వెలువరిచే అవకాశం ఉంది. ఈ కేసును త్వరగా తేల్చాలనే ఉద్దేశ్యంతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసంన ఏర్పాటు చేసింది.

ఇతర కేసులను పక్కన పెట్టి  సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 40 రోజుల పాటు ఇదే కేసును విచారించింది.  ఈ కేసులో ప్రధానంగా మూడు పక్షాలు 40 రోజుల పాటు తమ వాదనలను విన్పించాయి. అయితే తమ వాదనలను సమర్ధించుకొనేలా ఈ పక్షాలు వాదనలు చేశాయి.

సున్నీ వక్ప్‌బోర్డు,  హిందూ మహాసభ, రాంలాల్ విరాజ్ మాన్ లు తమ వాదనలను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు విన్పించాయి. తమ వాదనలకు బలం చేకూరేలా ఆధారాలను కూడ చూపాయి. అయోధ్య కేసులో చివరి రోజున సున్నీ వక్ఫ్ ‌బోర్డు తన వాదనలను విన్పించింది. ఇంకా ఈ కేసులో తమ వాదనలను విన్పించే అవకాశం లేకుండా పోయింది.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu