Lakhimpur Kheri: నేడు సుప్రీం విచారణ.. హైకోర్టు మాజీ న్యాయమూర్తితో దర్యాప్తు కమిటీ వేసిన యూపీ ప్రభుత్వం

By telugu teamFirst Published Oct 7, 2021, 11:44 AM IST
Highlights

లఖింపూర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేయనుంది. సుప్రీంకోర్టు విచారణకు ముందే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తితో ఏకసభ్య దర్యాప్తు కమిటీ వేసింది. రెండు నెలల్లో ఎంక్వైరీ పూర్తి చేసి రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది. 

న్యూఢిల్లీ: దేశమంతటా కలకలం రేపిన ఉత్తరప్రదేశ్‌లోని lakhimpur kheri ఘటనపై నేడు supreme court విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమ కోహ్లీల త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలు పాల్గొనబోతున్న కార్యక్రమానికి నిరసనగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ వెనుక నుండి వచ్చి రైతులపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. కాన్వాయ్‌లోని నలుగురు వ్యక్తులనూ దాడికి గురై మరణించారు. ఇందులో ఓ జర్నలిస్టు, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఓ డ్రైవర్ ఉన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం కావడం, యూపీకి చెందిన ఇద్దరు న్యాయవాదులు cji justice nv ramanaకు లేఖలు రాసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఘటనను సుమోటుగా స్వీకరించి విచారించడానికి సిద్ధమైంది.

నేడు సుప్రీంకోర్టు ఈ ఘటనపై విచారణ ప్రారంభించనుండగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమూ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు మాజీ న్యాయమూర్తితో సింగిల్ మెంబర్ దర్యాప్తు కమిటీ వేసింది. రిటైర్డ్ జడ్జీ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ ఎంక్వైరీ చేయనున్నారు. ఈ కమిటీ రెండు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేసి రిపోర్టును సమర్పించాలని uttar pradesh అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ్ కుమార్ అవస్తీ ఆదేశించారు.

ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ ఘటనపై కేసు ఫైల్ చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రాపైనా మర్డర్ సహా ఇతర యాక్ట్‌ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదై నాలుగు రోజులు గడిచినా ఇంకా ఎవరి అరెస్టులూ జరగలేదు. ఘటనతో తమకు సంబంధం లేదని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చెబుతూ వస్తున్నారు. నల్లరంగు ఎస్‌యూవీ తమదేనని చెప్పిన కేంద్ర మంత్రి తాము ఆ కాన్వాయ్‌లో లేమని వివరించారు. అదే సమయానికి తన కొడుకు అశిశ్ మిశ్రా సుమారు వేయి మంది పాల్గొన్న మరో కార్యక్రమంలో ఉన్నారని తెలిపారు. రైతులు మాత్రం అశిశ్ మిశ్రా ఆ కాన్వాయ్‌లోనే ఉన్నారని చెబుతున్నారు.

click me!