గత 24 గంటల్లో 41,381 కోవిడ్ కేసులు: రికవరీ రేటు 97.36 శాతంగా నమోదు

Published : Aug 01, 2021, 09:58 AM IST
గత 24 గంటల్లో 41,381 కోవిడ్ కేసులు: రికవరీ రేటు 97.36 శాతంగా నమోదు

సారాంశం

ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.కరోనా కొత్త కేసుల కంటే రికవరీ నమోదు కావడం కొంత ఉపశమనంగా కన్పిస్తోంది. కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు గాను వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.


న్యూఢిల్లీ: గత 24 గంటల్లో ఇండియాలో  41,831 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజు 39,258 కరోనా నుండి కోలుకొన్నారు.  దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు  97.36 శాతంగా ఉంది.దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 4,10,952 నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 1.30 శాతంగా నమోదైంది.వీక్లీ పాజిటివిటీ రేటు 5 శాతం దిగువన నమోదైందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

దేశంలో ఇంతవరకు  3,08,20,521 మంది కరోనా నుండి కోలుకొన్నారు. నిన్న ఒక్క రోజే 541 మంది కరోనాతో మరణించారు..కరోనా నుండి నిన్న ఒక్క రోజే 39,528 మంది కరోనా నుండి కోలుకొన్నారు.దేశంలో ఇప్పటివరకు 47.02 కోట్లకు పైగా మంది వ్యాక్సిన్ వేసుకొన్నారు.ఆగష్టు మాసంలో థర్డ్‌వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కఠినంగా ఆంక్షలను అమలు చేయాలని కేంద్ర హోంశాఖ ఆయా రాష్ట్రాలకు సూచించింది. కరోనా గైడ్‌లైన్స్  ను ఆగష్టు 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్