ఏపీ రాజధానిగా హైదరాబాద్... ఏపీ పిటిషన్ ను తప్పుబట్టిన సుప్రీం కోర్ట్

By Arun Kumar PFirst Published Jul 2, 2021, 1:28 PM IST
Highlights

హైదరాబాద్ ను ఆంధ్ర ప్రదేశ్ రాజధానికి పేర్కొంటూ దాఖలయిన పిటిషన్ ను తప్పుబట్టింది సుప్రీంకోర్టు.

న్యూడిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ను పేర్కొంటూ దాఖలయిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తప్పుబట్టింది. కరోనా విజృంభణ సమయంలో ఏపీ నుండి వచ్చేవారికి తెలంగాణ ప్రభుత్వం ఈ పాస్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం తెలంగాణ సర్కార్ జారీచేసిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ ఏపీకి చెందిన న్యాయవిధ్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 

ఈ పిటిషన్ పై తాజాగా విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థాయం సదరు పిటిషన్లో పేర్కొన్న కొన్ని వ్యాఖ్యలను తప్పుబట్టింది. హైదరాబాద్ ను ఆంధ్ర ప్రదేశ్ రాజధానికి పిటిషన్లో పేర్కొనడం తప్పని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

read more  సీఎం గారూ... జలజగడంపై ఇలా చేయండి, ఫలితం ఉంటుంది: జగన్ కు రఘురామ లేఖ

''ఏపీ రాజధానిగా హైదరాబాద్ ను పేర్కొనడం తప్పు. జాతీయ విపత్తు చట్టం ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ఈ పాస్ తప్పనిసరి చేసింది. అయినా ఆ నోటిఫికేషన్ గుడువు కూడా ముగిసింది. కానీ మీరింకా రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5 వద్దే ఆగిపోయారు'' అంటూ పిటిషనర్ ను తప్పుబడుతూ అతడు దాఖలుచేసిన పిటిషన్ ను తప్పుబట్టింది. 
 

click me!