
తమిళనాడు, చెన్నై ఐఐటి మద్రాస్ క్యాంపస్ లో 22 ఏళ్ల ఇంజనీర్ చనిపోయాడు. మృతుడు ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇతడు ఆత్మహత్య చేసుకుని మరణించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
చనిపోయిన వ్యక్తిని ఉన్నికృష్ణన్ గా గుర్తించారు. ఐఐటి మద్రాసులో ఒక ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాడని తేలింది. పని ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని ఒక లేఖను రాసిపెట్టాడు. అని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
మృతి సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.