యోగా గురువు బాబా రాందేవ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ఎందుకంటే ?

By Sairam IndurFirst Published Apr 2, 2024, 5:51 PM IST
Highlights

ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు ఆయన కోర్టుతో పాటు యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలని పేర్కొంది.

పతంజలి ఔషధ ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే ప్రకటనలపై తమ ఆదేశాలను ఉల్లంఘించినందుకు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా మండిపడింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో బాబా రాందేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

యోగా గురువు బాబా రామ్ దేవ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రామ్‌దేవ్ తరఫు సీనియర్ న్యాయవాది బల్బీర్ సింగ్ ను కోర్టు ఆదేశించింది. అయితే, పతంజలి తమ తప్పుదోవ పట్టించే వాదనలు చేసినందుకు యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈడీ వేధింపుల ఏజెన్సీగా వ్యవహరిస్తోంది - కవిత తరపు న్యాయవాది

ఈ వాదనల సమయంోల సుప్రీంకోర్టు కూడా కేంద్రాన్ని నిలదీసింది. అల్లోపతిలో కొవిక్ కు మందు లేదని పతంజలి చెబుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు కళ్లు మూసుకుందని ప్రశ్నించింది. దీనిపై వారం రోజుల్లోగా కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని బాబా రాందేవ్, బాలకృష్ణలకు సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

కోర్టు నోటీసుపై పతంజలి, ఆచార్య బాలకృష్ణ స్పందించలేదని, ఇది పూర్తిగా విస్మరించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘సుప్రీంకోర్టు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులు ఇచ్చే ప్రతి ఉత్తర్వును గౌరవించాలి. ఈ విషయంలో మీరు అఫిడవిట్ దాఖలు చేసి ఉండాలి. కోర్టులో ఇచ్చిన హామీలను పాటించాలి. ప్రతి పరిమితిని దాటారు.’’ అని పేర్కొంది.  

పతంజలి అఫిడవిట్ తో సమర్పించిన పత్రాలను తర్వాత సృష్టించారని పేర్కొంటూ రాందేవ్, బాలకృష్ణలను కోర్టు హెచ్చరించింది. 'ఇది స్పష్టమైన అవాస్తవం. మేము మీకు తలుపులు మూసివేయడం లేదు, కానీ మేము గమనించినవన్నీ మీకు చెబుతున్నాము" అని కోర్టు తెలిపింది.

బీజేపీలో చేరాలని ఒత్తిడి.. లేకపోతే నెల రోజుల్లో అరెస్ట్ చేస్తారట - ఢిల్లీ మంత్రి అతిషి

కాగా.. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించినందుకు పతంజలిపై కోర్టు నోటీసులకు సమాధానాలు దాఖలు చేయడంలో విఫలమైనందుకు గత విచారణలో సుప్రీంకోర్టు పతంజలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఔషధ చికిత్సలపై పతంజలి తప్పుడు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ప్రచురించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

click me!