Delhi Liquor Scam: ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీని సవరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని, లైసెన్స్‌దారులకు ప్రయోజనాలను కల్పించారని సీబీఐ, ఈడీ ఆరోపించాయి. ఇందులో లైసెన్స్ ఫీజు మినహాయింపు లేదా తగ్గించబడింది. ఈ విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.144.36 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ కేసులో ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కవితలను అరెస్ట్ చేశారు. స్కామ్ ఏంటో తెలుసా...
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) మంగళవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఎంపీ సంజయ్ సింగ్‌ను ఇన్నాళ్లు కస్టడీలోకి ఎందుకు తీసుకున్నారని.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను(ED) సుప్రీంకోర్టు ప్రశ్నించింది.సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఆ తర్వాత సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సంజయ్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతేడాది అక్టోబర్ 4న అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో మద్యం (కంపెనీ) గ్రూపుల నుంచి లంచాలు స్వీకరించే కుట్రలో సంజయ్ సింగ్ భాగమని ED గతంలో కోర్టుకు తెలిపింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఆగష్టు, 2022లో రద్దు చేయబడింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించిన అక్రమాలు , అవినీతిపై దర్యాప్తు చేయవలసిందిగా CBIని ఆదేశించారు.
ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీని సవరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని, లైసెన్స్‌దారులకు ప్రయోజనాలను కల్పించారని సీబీఐ, ఈడీ ఆరోపించాయి. ఇందులో లైసెన్స్ ఫీజు మినహాయింపు లేదా తగ్గించబడింది. ఈ విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.144.36 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ కేసులో ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కవితలతో సహా ఈ 14 మందిపై ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇలా ఓ ముఖ్యమంత్రి, మాజీ ఉపముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి కూతురు జైలు పాలైన ఈ స్కాం ఏంటి అనే ప్రశ్న పదే పదే జనాల్లో మొదులుతున్నాయి. ఇంతకీ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ అంటే ఏమిటి?
కొత్త ఎక్సైజ్ పాలసీ స్కామ్ ఏంటి...
ఈ కథ ఢిల్లీలో ప్రారంభమైంది. 17 నవంబర్ 2021న కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతామని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రకటన తరువాత పెద్ద ఎత్తున అక్రమ పెట్టుబడులు వచ్చాయి. కాగా.. జూలై 2022లో ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు సంబంధించి అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు నివేదిక సమర్పించారు. ఈ పాలసీలో అవకతవకలతో పాటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మద్యం వ్యాపారులకు అనుచిత ప్రయోజనాలు చేకూర్చారని ఆరోపించారు. ఈ నివేదిక ఆధారంగా.. కొత్త ఎక్సైజ్ పాలసీ (2021-22) అమలులో నిబంధనల ఉల్లంఘనలు, విధానపరమైన లోపాలను పేర్కొంటూ లెఫ్టినెంట్ గవర్నర్ 2022 జూలై 22న సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు.
మనీలాండరింగ్ కేసు నమోదు
ఈ క్రమంలో సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయగా, ఈ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ పాలసీని సవరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని, లైసెన్సుదారులకు అనుచిత ప్రయోజనాలు కల్పించారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి. అలాగే .. ఈ పాలసీలో లైసెన్స్ ఫీజు మినహాయింపు లేదా తగ్గించబడింది. ఈ విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.144.36 కోట్ల నష్టం వాటిల్లిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై దర్యాప్తును సిఫార్సు చేసిన తర్వాత, జూలై 30, 2022న ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ఉపసంహరించుకుని పాత విధానాన్ని పునరుద్ధరించింది.
ఇదీ విషయం...
ఎక్సైజ్ పాలసీని సవరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని, లైసెన్స్‌దారులకు అనుచిత ప్రయోజనాలను కల్పించారని సీబీఐ, ఈడీ ఆరోపించాయి. ఇందులో లైసెన్స్ ఫీజు మినహాయింపు లేదా తగ్గించబడింది. ఈ విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.144.36 కోట్ల నష్టం వాటిల్లింది. జూలై 22, 2022న, కొత్త ఎక్సైజ్ పాలసీ (2021-22) అమలులో నిబంధనల ఉల్లంఘనలు, విధానపరమైన లోపాలను పేర్కొంటూ LG VK సక్సేనా CBI విచారణకు సిఫార్సు చేశారు. దీనిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కొనసాగుతోందిలా...
2021
నవంబర్ 17: ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి వచ్చింది
2022
జూలై 20: పాలసీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు ఎల్జీ వీకే సక్సేనా సిఫార్సు చేశారు
ఆగస్టు 17: ఈ కేసులో 15 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది, ఇందులో మనీష్ సిసోడియా పేరు కూడా ఉంది.
ఆగస్టు 22: ఈ కేసులో ఈడీ ఎంటర్ అయ్యి.. మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది.
ఆగస్టు 31: ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని ఉపసంహరించుకుని పాత విధానాన్ని అమలు చేసింది.
నవంబర్ 25: ఈ కేసులో కీలక పరిణామం..ఏడుగురు నిందితులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది
2023
ఫిబ్రవరి 26: విచారణ అనంతరం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది
ఫిబ్రవరి 28: అరెస్టును వ్యతిరేకిస్తూ మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే రోజు సిసోడియా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
మార్చి 9: తీహార్ జైలు నుంచి సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది
అక్టోబర్ 4: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంటిపై ఈడీ దాడులు చేసి, ఆ తర్వాత అరెస్ట్ చేసింది
నవంబర్ 2: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ తొలి సమన్లు పంపింది
2024
మార్చి 15: బీఆర్‌ఎస్ నేత కే కవితను ఈడీ అరెస్ట్ చేసింది
మార్చి 21: కేజ్రీవాల్ ఇంటిపై ఈడీ దాడులు చేసి, అరెస్టు చేసింది
ఏప్రిల్ 2 : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించింది.