ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి, ప్రాణాలతో బయటపడ్డ భర్తకి శిక్ష..?

By telugu news teamFirst Published Sep 15, 2021, 7:57 AM IST
Highlights

ఆత్మహత్య చేసుకోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితులు కల్పించినప్పుడే.. ప్రేరేపించారని భావించి శిక్ష వేయాల్సి ఉంుటందని న్యాయమూర్తులు జస్టిస్ ఎం. ఆర్.షా, జస్టిస్ అనిరుద్ధ బోస్ లతో కూడిన ధర్మాసనం స్పష్టత ఇచ్చింది.

ఏవో కారణాల వల్ల భార్యభర్తలు ఆత్మహత్య  చేసుకోవాలని అనుకున్నారు.  విషం తాగేశారు. దీంతో.. భార్య మృతి చెందగా.. భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే.. భార్య చనిపోవడానికి కారణం భర్తేనంటూ అతనిపై కేసు పెట్టారు. కాగా.. ఈ ఘటనపై తాజాగా సుప్రీం కోర్టు స్పందించింది.

దంపతులిద్దరూ విషం తాగిన సందర్భంలో ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ భర్తకు శిక్ష విధించడం సరికాదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆత్మహత్య చేసుకోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితులు కల్పించినప్పుడే.. ప్రేరేపించారని భావించి శిక్ష వేయాల్సి ఉంుటందని న్యాయమూర్తులు జస్టిస్ ఎం. ఆర్.షా, జస్టిస్ అనిరుద్ధ బోస్ లతో కూడిన ధర్మాసనం స్పష్టత ఇచ్చింది.

కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. తమిళనాడుకు చెందిన వేలుదురైకు వివాహం జరిగి 25ఏళ్లు కాగా.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య గొడవ జరగగా.. అనంతరం ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఆమె చనిపోగా.. ఆయన బతికాడు. దాంతో ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ ఆయనకు సెక్షన్ 306 కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది.

హైకోర్టు కూడా ఇందుకు ఆమోదించింది. సుప్రీం కోర్టు మాత్రం ఏకీభవించలేదు. ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారని.. అందువల్ల భర్త ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా భావించలేమని తెలిపింది. భార్యభర్తల మధ్య జరిగిన గొడవ తప్ప, ఇతరత్రా సంఘటనలు జరిగినట్టు నిరూపించలేదని పేర్కొంది.
 

click me!