ఉబెర్‌, ర్యాపిడో, ఓలా లకు షాక్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు..!

Published : Jun 12, 2023, 11:21 PM IST
ఉబెర్‌, ర్యాపిడో, ఓలా లకు షాక్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు..!

సారాంశం

ఢిల్లీలో ఓలా, ఉబెర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సేవలను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఢిల్లీ సర్కారు కొత్త విధానాన్ని రూపొందించే వరకు ద్విచక్ర వాహనాలను నడపొద్దని ఆయా సంస్థలను ఆదేశించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ సర్కారు కొత్తగా నోటీసు జారీ చేసింది.

బైక్ టాక్సీ అందించే ఓలా, ఉబెర్‌, ర్యాపిడో సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఢిల్లీలో ఉబెర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సేవలను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై  సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. అప్ సర్కార్ కొత్త విధానాన్ని రూపొందించే వరకు ద్విచక్ర వాహనాలను నడపొద్దని ఆయా సంస్థలను ఆదేశించింది.

అప్ సర్కార్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్తగా నోటీసు జారీ చేసింది. ఢిల్లీలో బైక్-టాక్సీలు నడపకూడదని, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే.. అట్టి అగ్రిగేటర్లకు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ సందర్భంగా క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీలకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. 

సుప్రీంకోర్టులో కేసు విచారణ సందర్భంగా.. ఉబర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. 2019 నుండి చాలా రాష్ట్రాల్లో ద్విచక్ర వాహనాలను బైక్ సర్వీస్ కోసం ఉపయోగిస్తున్నారు. మోటారు వాహన చట్టం ప్రకారం దీనిపై ఎటువంటి పరిమితి లేదు. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ ప్రకారం ద్విచక్ర వాహనాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవచ్చని ఉబర్ న్యాయవాది తెలిపారు.

దీనిపై సుప్రీం కోర్టు.. వాహనం ఎవరినైనా ఢీకొన్నా, ప్రమాదం జరిగినా బీమా ఇస్తారా అని ప్రశ్నించింది. ఉబెర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ని అందజేస్తుందని, 35 వేలకు పైగా డ్రైవ్‌లు ఉన్నాయని, వారి జీవనోపాధి దీనిపై ఆధారపడి ఉందని ఉబర్ లాయర్ చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వానికి 4 ఏళ్లుగా ఎలాంటి పాలసీ లేదని, ఢిల్లీ ప్రభుత్వం పాలసీని రూపొందించే వరకు మాకు ఉపశమనం కల్పించాలని ఉబర్ లాయర్ అన్నారు.

పాలసీ వెలువడే వరకు ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. అగ్రిగేటర్ కంపెనీలకు బైక్ సర్వీస్ అనుమతించబడింది. వీరిపై ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరి 2023లో ఢిల్లీ ప్రభుత్వం Ola-Uber, Rapido వంటి క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీల బైక్ సేవలను నిషేధించింది.

వాణిజ్య అవసరాల కోసం టూ వీలర్లను ఉపయోగించడం మోటారు వాహనాల చట్టం-1988ని ఉల్లంఘించడమేనంటూ టూ వీలర్‌ ట్యాక్సీ సర్వీసులు అందించే సంస్థల్ని హెచ్చరించింది. ఢిల్లీ ప్రభుత్వంతో పాటు నగర పాలక సంస్థ జారీ చేసిన షోకాజ్ నోటీసును రాపిడో సవాల్‌ చేసింది ఢిల్లీ హైకోర్టులో.హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో, ఢిల్లీలో ఓలా, ఊపర్, రాపిడో , ఇతర బైక్ టాక్సీల నిర్వహణ నిషేధించబడింది.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu