జహంగీర్ పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్... ఆపేయాలని సుప్రీం ఆదేశం...

Published : Apr 20, 2022, 01:37 PM IST
జహంగీర్ పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్... ఆపేయాలని సుప్రీం ఆదేశం...

సారాంశం

హనుమాన్ జయంతి అల్లర్లతో వార్తల్లో నిలిచిన జహంగీర్ పురీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతను ఆపివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిమీద తదుపరి ఆదేశాలు వచ్చేవరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. 

ఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలోని Jahangirpuriలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం చర్యలు ప్రారంభించింది. దీనిపై supreme court కలగజేసుకుని నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ ను వెంటనే నిలిపివేయాలని, యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.  అలాగే దీనికి సంబంధించిన విచారణను రేపు చేపడతామని తెలిపింది.  మరోపక్క స్థానిక యంత్రాంగంపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి.

ఇటీవల జహంగీర్ పూరిలో కొన్ని వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు కూల్చి వేయాలంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా సదర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కు లేఖ రాశారు.  ఆ తర్వాత అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ ప్రారంభమైంది. ఈ డ్రైవ్ రోజువారీ కార్యకలాపాలలో భాగమేనని మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ వెల్లడించారు.  ఈ లేఖ రాసిన సమయంలో ఈ చర్యలు చేపట్టడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా..  సుప్రీం ఆదేశాల మేరకు తాము ఈ కూల్చివేత ప్రక్రియను నిలిపివేస్తామని  ఇక్బాల్ వెల్లడించారు.

బుల్డోజర్ స్విచ్ ఆఫ్ చేయండి.. రాహుల్ గాంధీ
ఈ డ్రైవ్ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. వెంటనే ద్వేషపూరిత బుల్డోజర్ లను ఆపి వేయండి అని విమర్శించారు. ‘ఈ ఎనిమిది సంవత్సరాల పాలన ఫలితంగా కేవలం ఎనిమిది రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. మోడీజీ  ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతుంది. విద్యుత్ కోత చిన్న పరిశ్రమలను ధ్వంసం చేస్తుంది. ఇది మరింత నిరుద్యోగానికి దారి తీస్తుంది. అందుకే  ద్వేషపూరిత బుల్డోజర్ లను ఆపివేసి పవర్ ప్లాంట్ ను ఆన్ చేయండి’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 19న కేంద్ర హోంమంత్రి Amit shah జహంగీర్‌పురి హింసాత్మక ఘటనలపై ఢిల్లీ అడ్మినిస్టేషన్ తో మాట్లాడినట్లు సమచారం. Jahangirpuri హింసపై ప్రధానంగా బ్రీఫింగ్ సందర్భంగా, Hanuman Jayanti శోభా యాత్ర ఘర్షణలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని షా ఆదేశాలు ఇచ్చారని, తద్వారా ఢిల్లీలో ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా చూడాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి 2020 అల్లర్ల తర్వాత ఢిల్లీలో జరిగిన మొదటి మతపరమైన చిచ్చు ఇది. ఏప్రిల్ 16న నగరంలోని జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా రాళ్లదాడి, ఘర్షణల కారణంగా 8 మంది పోలీసు సిబ్బంది, ఒక పౌరుడు గాయపడ్డారు. ఆ తరువాత ఢిల్లీలో భారీ పోలీసులు మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు కాలీనడకన, మోటారు సైకిల్ పెట్రోలింగ్‌తో పాటు ఫ్లాగ్ మార్చ్‌లు కూడా నిర్వహిస్తున్నారు.

ఈ దాడి ఘటన మీద జహంగీర్‌పురి పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 147, 148, 149, 186, 307, 323, 332, 353, 427, 436.. ఆయుధాల చట్టంలోని సెక్షన్ 27 కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయబడింది.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?