ఢిల్లీలోని జహంగీర్‌పురిలో టెన్షన్ : సుప్రీం ఆదేశాలున్నా కూల్చివేతలపై నిరసనలు

Published : Apr 20, 2022, 01:20 PM IST
ఢిల్లీలోని జహంగీర్‌పురిలో టెన్షన్ : సుప్రీం ఆదేశాలున్నా కూల్చివేతలపై నిరసనలు

సారాంశం

ఢిల్లీలోని జహంగీర్‌పురిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా కూల్చివేతలు కొనసాగంపై నిరసనలు వ్యక్తం చేశారు.


న్యూఢిల్లీ: ఢిల్లీలోని  Jahangirpuriలో అక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే జహంగీర్‌పురిలో ఆక్రమణలు కూల్చివేయకూడదని Superme Court ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆక్రమణల కూల్చివేతలను నిలివివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన  ఆదేశాలు తమకు అందలేదని కూడా అధికారులు చెబుతున్నారు. సుప్రీం ఆదేశాలు అందే వరకు తాము ఆక్రమణలను కూల్చివేస్తామని కూడా ప్రకటించారు.

 New Delhiలోని జహంగీర్‌పురిలోని Masjid సమీపంలో ఆక్రమణల కూల్చివేతను నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ చేపట్టింది. అనుమతి లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అందిన ఫిర్యాదు మేరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అయితే ఈ నెల 16న జహంగీర్ పురిలోని మసీదు వద్దే ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకొన్న విషయం తెలిసిందే.  అయితే ఈ ఆదేశాలు తమకు అందలేదని మున్సిపల్ అధికారులు కూల్చివేతలను కొనసాగించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను  అమలు చేయకపోవడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్న ప్రాంతానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ వెళ్లి ఆందోళన చేశారు. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆక్రమణల కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఆదేశాలు అందడంతో మున్సిపల్ అధికారులు కూల్చివేతలను నిలిపివేశారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం