ఎన్నికల్లో నేరస్థుల పోటీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

By sivanagaprasad kodatiFirst Published Sep 25, 2018, 11:06 AM IST
Highlights

క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులు వారిపై అభియోగాల దశలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.  

క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులు వారిపై అభియోగాల దశలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తీర్పు సమయంలో మాట్లాడుతూ.. అవినీతి జాతీయ ఆర్ధిక ఉగ్రవాదమన్నారు.. అభ్యర్థుల అనర్హతపై సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని... నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా.. పార్లమెంట్ కఠిన చట్టాలు చేయాలని సీజేఐ సూచించారు.. అలాగే ఛార్జిషీట్ ఆధారంగా అభ్యర్థులు పోటీ చేయకుండా అడ్డుకోలేమని.. అభ్యర్థులందరూ పెండింగ్ కేసుల వివరాలు వెల్లడించాలని దీపక్ మిశ్రా సూచించారు. 

ప్రజాప్రాతినిథ్య చట్టం కింద ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో వారు దోషులుగా తేలితేనే పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటిస్తున్నారు. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆగస్ట్ 28న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 

click me!