ఉత్తరాదిని వణికిస్తున్న వరదలు...11 మంది మృతి

By sivanagaprasad kodatiFirst Published 25, Sep 2018, 7:53 AM IST
Highlights

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల దెబ్బకు వాగులు, వంకలు ఏకమై ప్రవహిస్తూ ఉండటం, వరదలు, కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల దెబ్బకు వాగులు, వంకలు ఏకమై ప్రవహిస్తూ ఉండటం, వరదలు, కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు.

ప్రధానంగా పంజాబ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. బియాస్, సట్లెజ్, రావి నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉండటంతో పంజాబ్ ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది.

భారీ వర్షాల కారణంగా బద్రినాథ్, కేదార్‌నాథ్, యమునోత్రికి వెళ్లే రహదారులపై కొండచరియలు విరిగిపడటంతో చార్‌ధామ్ యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు దేశరాజధాని ఢిల్లీపైనా వర్షం ప్రభావం గట్టిగా కనిపిస్తోంది.

రోడ్లన్నీ జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ సమాధి అయ్యారు. 

Last Updated 25, Sep 2018, 7:53 AM IST