గోల్డ్ మెడలిస్ట్.. కానీ శాడిస్ట్.. మహిళలకు అశ్లీల చిత్రాలు

sivanagaprasad kodati |  
Published : Sep 25, 2018, 10:52 AM IST
గోల్డ్ మెడలిస్ట్.. కానీ శాడిస్ట్.. మహిళలకు అశ్లీల చిత్రాలు

సారాంశం

అతనొక ప్రతిభగల క్రీడాకారుడు.. అతని టాలెంట్‌కు జూడోలో గోల్డ్ మెడల్ వరించింది. అలాంటి క్రీడాకారుడి బుద్ధి గడ్డి తింది. మహిళలకు అశ్లీల చిత్రాలు పంపుతూ అడ్డంగా బుక్కయ్యాడు.

అతనొక ప్రతిభగల క్రీడాకారుడు.. అతని టాలెంట్‌కు జూడోలో గోల్డ్ మెడల్ వరించింది. అలాంటి క్రీడాకారుడి బుద్ధి గడ్డి తింది. మహిళలకు అశ్లీల చిత్రాలు పంపుతూ అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హర్యానాకు చెందిన సోనూశర్మ.. జూడో క్రీడాకారుడు.. పలు టోర్నీల్లో అనేక మెడల్స్ దక్కించుకున్నాడు.

అయితే మహిళల పట్ల మాత్రం ఇతను అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. పలువురు మహిళలకు అశ్లీల చిత్రాలు పంపుతూ మానసికంగా వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన ఓ మహిళను వేధింపులకు గురిచేయడంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా అశ్లీల చిత్రాలు పంపేవాడని.. అతని వల్ల తాను మానసిక ఇబ్బందికి గురయ్యానని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ