చైల్డ్ పోర్నోగ్రఫిపై సుప్రీంకోర్టు సీరియస్ ... ఇకపై కేవలం అలా చేసినా పోక్సో యాక్ట్ తప్పదు

By Arun Kumar PFirst Published Sep 23, 2024, 11:36 AM IST
Highlights

చిన్నారులపై లైంగిక వేదింపులను కట్టడి చేసే దిశగా సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చైల్డ్ ఫోర్నోగ్రఫీపై కఠిన శిక్షలు వుంటాయని దేశ అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. 

చైల్ట్ పోర్నోగ్రఫి వ్యవహారాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీరియస్ గా తీసుకుంది. చిన్నారులను లైంగిక వేధింపుల నుండి కాపాడేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చైల్డ్ పోర్నోగ్రపిని ఈజీగా తీసుకోలేమని తేల్చిచెప్పింది న్యాయస్థానం . చైల్డ్ పోర్నోగ్రపికి పాల్పడేవారినే కాదు ఇందుకు సంబంధించిన ఎలాంటి వస్తువులను కలిగివున్నా వారిపై పోక్సో యాక్ట్ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్) కింద నేరస్తులుగా పరిగణిస్తామని సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఈ మేరకు ఇవాళ (సెప్టెంబర్ 23) కీలక ఆదేశాలు జారీ చేసింది. 

కేవలం న్యాయవ్యవస్థ మాత్రమే కాదు పాలకులు కూడా చిన్నారులను లైంగిక దాడుల నుండి కాపాడే బాధ్యత తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇందులో భాగంగానే పోక్సో చట్టంలోని 'Child Pornography'అనే పదాన్ని తొలగించి '"Child Sexual Exploitative and Abusive Material'  గా మార్చాలని... ఇందుకోసం పార్లమెంట్ లో న్యాయ సవరణ చేయాలని సూచించింది. ఇకపై న్యాయస్థానాలు చైల్డ్ పోర్నోగ్రఫి అనే పదాన్ని ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

Latest Videos

ఇటీవల మద్రాస్ హైకోర్టు చైల్డ్ ఫోర్నోగ్రఫిని  డౌన్ లోడ్ చేసుకోవడం, చూడటం నేరం కాదని తేల్చింది. కానీ తాజాగా సుప్రీంకోర్టు దీన్ని తప్పుబట్టింది. చైల్డ్ పోర్నోగ్రఫి వ్యవహారంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జెబి పార్థివాల బెంచ్ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే మద్రాస్ హైకోర్ట్ తీర్పుతో ఏకీభవించని సుప్రీంకోర్ట్ చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వస్తువులు కలిగివుండటమూ ఫోక్సో చట్టం కింద నేరమేనని తేల్చింది. 

ఈ ఏడాది ఆరంభంలో అంటే జనవరి 11, 2024 న మద్రాస్ హైకోర్ట్ ఓ సంచలన తీర్చు ఇచ్చింది. ఓ 28 ఏళ్ల వ్యక్తి మొబైల్ ఫోన్ లో చైల్డ్ పోర్నోగ్రఫి కంటెంట్ ను కలిగివుండటంతో  పోలీసులు అతడిని అరెస్ట్ చేసారు. ఈ కేసు మద్రాస్ హైకోర్టు వరకు వెళ్లింది... విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇది నేరం కాదని తేల్చింది. ఇది ఫోక్సో యాక్ట్ కిందకు రాదని పేర్కొంటూ ఈ కేసును కొట్టివేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వద్దకు చేరడంతో మరో మలుపు తిరిగింది.   

 

click me!