బెళగావిలో దారుణం జరిగింది. బాకీ తీర్చనందుకు స్నేహితుడి భార్యను ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. బసవరాజ్, రమేశ్ అనే ఇద్దరు వ్యక్తులు షాహాపూర్‌లోని హోటల్‌లో సప్లయర్లుగా పనిచేస్తున్నారు
బెళగావిలో దారుణం జరిగింది. బాకీ తీర్చనందుకు స్నేహితుడి భార్యను ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. బసవరాజ్, రమేశ్ అనే ఇద్దరు వ్యక్తులు షాహాపూర్‌లోని హోటల్‌లో సప్లయర్లుగా పనిచేస్తున్నారు.. ఒకే చోట పనిచేస్తుండటంతో ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు.
బసవరాజు భార్య పార్వతి కూడా అదే హోటల్‌లో పనిచేస్తోంది. వీరికి మూడేళ్ల పాప కూడా ఉంది. అయితే బసవరాజు తన వద్ద తీసుకున్న రూ.500 బాకీ తీర్చనందుకు.. అతని భార్య పార్వతిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. దీంతో రమేశ్ , పార్వతిని పుట్టింటికి పంపాడు.
ఈ దారుణంపై బసవరాజు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.. దీంతో మంగళవారం బెళగావి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగాడు. తన భార్య రమేశ్ వద్ద రెండు నెలలుగా ఉంటోందని.. పార్వతిని తన వద్దకు పంపాలని ఎన్నిసార్లు గొడవ పెట్టుకున్నా అతను వినడం లేదని.. మరోసారి పార్వతి గురించి అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
రమేశ్‌తో జరిపిన ఫోన్ సంభాషణ టేపును బసవరాజు మీడియాకు సమర్పించాడు. ఈ క్రమంలో బసవరాజు ధర్నాకు స్పందించిన నగర పోలీస్ కమిషనర్.. రమేశ్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.