క్వారంటైన్ లోకి సుప్రీమ్ కోర్ట్ జడ్జి కుటుంబం, కారణమేంటంటే....

By Sree s  |  First Published May 15, 2020, 2:35 PM IST

వంట మనిషి కి కరోనా వైరస్ సోకడంతో ఢిల్లో లోని ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఆయన కుటుంబం హోం క్వారంటైన్లోకి వెళ్లాల్సి వచ్చింది. సెలవు లో ఉండి ఇటీవలే తిరిగి వచ్చిన  సదరు వంట మనిషి.. తన ఊరిలోనో, లేదా మార్గమధ్యంలోనో ఈ మహమ్మారి బారిన పడినట్టు భావిస్తున్నారు.
 


న్యూఢిల్లీ:  వంట మనిషి కి కరోనా వైరస్ సోకడంతో ఢిల్లో లోని ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఆయన కుటుంబం హోం క్వారంటైన్లోకి వెళ్లాల్సి వచ్చింది. సెలవు లో ఉండి ఇటీవలే తిరిగి వచ్చిన  సదరు వంట మనిషి.. తన ఊరిలోనో, లేదా మార్గమధ్యంలోనో ఈ మహమ్మారి బారిన పడినట్టు భావిస్తున్నారు.

ముందస్తు జాగ్రత్తగా న్యాయమూర్తి, ఆయన కుటుంబాన్ని హోం క్వారంటైన్లో ఉంచారు. కుక్‌ ను కలిసిన రిజిస్టార్, పలువురు సెక్యూరిటీ సిబ్బంది కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు సమాచారం.

కొవిడ్-19 లాక్‌ డౌన్ కారణంగా ఇంటి వద్ద నుంచే వీడియో కాన్ఫరెన్సుల ద్వారా వాదనలు వింటున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇటీవలే కోర్టు రూముల్లో విచారణ ప్రారంభించారు.

అక్కడ కూడా ప్రస్తుతానికి వీడియో కాన్ఫరెన్సుల ద్వారానే వాదనలు జరుగుతన్నాయి. వచ్చే వారం నుంచి న్యాయవాదులు కూడా తమ చాంబర్ల లో వాదనలు వినిపించే అవకాశం ఉంది.

Latest Videos

ప్రస్తుతం సుప్రీం కోర్టులో మొత్తం 32 మంది న్యాయమూర్తులు ఉండగా.. చాలా వరకు కేసులను సింగిల్ జడ్జి ధర్మాసనాలే వింటున్నాయి. విస్తృత స్థాయి ధర్మాసనాలు మినహా సాధారణంగా సుప్రీం కోర్టులో ఇద్దరు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాలు వాదనలు వింటాయి. 

భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారికి అడ్డుకట్ట పడడం లేదు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 81 వేలు దాటింది. మొత్తం 81,970కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా వైరస్ 2,649 మరణాలు సంభవించాయి.

దేశంలో ఇప్పటి వరకు 26235 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ కాగా, 50వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత  24 గంటల్లో దేశంలో 3,722 కేసులు నమోదు కాగా, 100 మంది కోవిడ్ -19 వ్యాధితో మరణించారు. దేశంలో రికవరీ రేటు 33.63 శాతం ఉంది.

గత నాలుగు రోజుల్లో 12 వేల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 

రోజు రోజుకూ కరోనా వైరస్ కేసులు, మరణాలు పెరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీలోని ఘాజీపూర్ కూరగాయల మార్కెట్ ను రెండు రోజుల పాటు మూసేయనున్నారు. మార్కెట్ కార్యదర్శికి, డిప్యూటీ కార్యదర్శికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో మార్కెట్ మొత్తాన్ని శానిటైజ్ చేయనున్నారు. 

కరోనా వైరస్ మాసిపోయేది కాదని, హెచ్ఐవి పాజిటివ్ వంటిదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖైలి జె రియాన్ అన్నారు. హెఐవి రూపుమాసిపోలేదని, అలాగే కరోనా వైరస్ కూడా అంతమయ్యేది కాదని అన్నారు. 

click me!