వలస కూలీలకు తాము ఎలా నిలిపివేయగలమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే వలస కార్మికులకు ఉచిత భోజన వసతి కల్పించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం నాడు తిరస్కరించింది.
న్యూఢిల్లీ:వలస కూలీలకు తాము ఎలా నిలిపివేయగలమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే వలస కార్మికులకు ఉచిత భోజన వసతి కల్పించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం నాడు తిరస్కరించింది.
రవాణా సౌకర్యాలు కల్పించే వరకు వలస కార్మికులు ఓపిక పట్టలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వంత గ్రామాలకు నడిచే వెళ్లాలనుకొనేవాళ్లను ఎవరు ఆపగలుగుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
రైలు పట్టాలపై నిద్రించేవారిని ఎలా అడ్డుకోగలమని సుప్రీంకోర్టు అడిగింది. వలస కార్మికులు నడుచుకొంటూ ఇతర మార్గాల ద్వారా వెళ్తున్న విషయాన్ని పర్యవేక్షించడం కోర్టుకు సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
also read:టెక్కీ పెళ్లికి లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఫోన్‌పై అక్షింతలు వేసి కొడుకుకి ఆశీర్వాదం
సుప్రీంకోర్టు జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ నెల 8వ తేదీన 16 మంది వలస కూలీలు రైలు పట్టాలపై నిద్రిస్తున్న సమయంలో గూడ్స్ రైలు వారిపై నుండి ప్రయాణించడంతో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ ప్రమాదంలో మరణించిన కూలీలు మధ్యప్రదేశ్ నుండి రైలు పట్టాలపై నడుచుకొంటూ వెళ్తూ పట్టాలపై పడుకొన్నారని అధికారులు గుర్తించారు.