ఎన్నికల కమిషన్‌పై సుప్రీం అసంతృప్తి

By narsimha lodeFirst Published Apr 15, 2019, 12:14 PM IST
Highlights

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం ప్రతి నిధులు మంగళవారం నాడు తమ ముందు హాజరై వివరణ కావాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం ప్రతి నిధులు మంగళవారం నాడు తమ ముందు హాజరై వివరణ కావాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న ప్రచారం పై కూడ సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సక్రమంగా పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని చెక్ చేస్తున్నారా లేదా అనే విషయమై ఈసీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎన్నిక ప్రచారంలో బీఎస్పీ చీఫ్ మాయావతి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన కామెంట్స్‌ను కూడ  సుప్రీంకోర్టు  ప్రస్తావింంచింది.

ఎన్నికల సంఘానికి తక్కువగా అధికారాలు ఉండడంపై కూడ సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.  ఈ విషయమై  మంగళవారం నాడు తమ ముందు హజరై వివరణ ఇవ్వాలని  సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

మీనాక్షి లేఖి ఫిర్యాదు: రాహుల్‌గాంధీకి సుప్రీం నోటీసులు


 

click me!