చౌకీదార్ చోర్ వివాదం: రాహుల్ గాంధీకి సుప్రీం షాక్

Published : Apr 23, 2019, 12:49 PM ISTUpdated : Apr 23, 2019, 01:02 PM IST
చౌకీదార్ చోర్ వివాదం: రాహుల్ గాంధీకి సుప్రీం షాక్

సారాంశం

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై  సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చౌకీదారు చోర్ అంటూ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ వివరణల్లో పశ్చాత్తాపం కన్పించడం లేదని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై  సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చౌకీదారు చోర్ అంటూ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ వివరణల్లో పశ్చాత్తాపం కన్పించడం లేదని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మంగళవారం నాడు రాహుల్ కు కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది సుప్రీంకోర్టు.

చౌకీదార్ చోర్ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై  సుప్రీం కోర్టు సీరియస్ అయింది.ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కూడ సమర్ధించినట్టుగా రాహుల్ వ్యాఖ్యలు చేశాడు.ఈ వ్యాఖ్యలపై ఈ నెల 22వ తేదీన సుప్రీంకోర్టులో ప్రధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన  వివరణ ఇచ్చారు.ఎన్నికల ప్రచారంలో భాగంగానే తాను కాపలదారు దొంగ అనే వ్యాఖ్యలు చేసినట్టుగా రాహుల్ వివరణ ఇచ్చారు.ఎన్నికల ప్రచార వేడిలో భాగంగానే మాట దొర్లిందని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ప్రధాని మోడీపై చౌకీదార్ చోర్ కామెంట్స్ ‌పై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని రాహుల్ గాంధీ ప్రకటించారు. రాహుల్ గాందీ ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత మీనాక్షి లేఖి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 15వ తేదీన రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టుకు  నోటీసులు జారీ చేసింది. 

ఈ నెల 22వ తేదీ లోపుగా ఈ విషయమై సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. సుప్రీం నోటీసులకు రాహుల్ గాంధీ ఇవాళ సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై తాను విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. 

అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోడీపై చేసిన వ్యాఖ్యలపై విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం నాడు సీరియస్ అయింది.రాహుల్ వ్యాఖ్యల్లో పశ్చాత్తాపం కన్పించడం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. చౌకీదార్ ఎవరంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 30వ తేదీ లోపుగా ఈ విషయమై సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

విచారం: చౌకీదార్ చోర్ కామెంట్స్‌‌పై దిగొచ్చిన రాహుల్‌

మీనాక్షి లేఖి ఫిర్యాదు: రాహుల్‌గాంధీకి సుప్రీం నోటీసులు

రాహుల్‌కు ఈసీ నోటీసుషాక్: 24 గంటల్లో వివరణ ఇవ్వాలి


 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin Assets Full Details | Nitin Nabin 2025 Election | Loans, Property | Asianet News Telugu
సొంతూళ్లోనే ఉంటూ రోజుకు రూ.6-7 వేల సంపాదన.. ఓ మహిళ సక్సెస్ స్టోరీ